134.8 కోట్లకు టెలికం యూజర్లు

Published on Wed, 07/29/2026 - 08:04

దేశీయంగా టెలికం సబ్‌స్క్రైబర్స్‌ సంఖ్య జూన్‌లో 134.8 కోట్లకు చేరింది. భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌లలో కొత్తగా యూజర్లు చేరడం ఇందుకు దోహదపడింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ విడుదల చేసిన డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మే నెలతో పోలిస్తే జూన్‌లో భారతి ఎయిర్‌టెల్‌ కస్టమర్లు 31.63 లక్షల మంది పెరిగారు. ఇందులో 29.89 లక్షల మొబైల్‌ సబ్‌స్క్రైబర్స్‌, 1.73 లక్షల ఫిక్సిడ్‌ లైన్‌ కనెక్షన్లు ఉన్నాయి.

రిలయన్స్‌ జియోలో నికరంగా 22.91 లక్షల మంది చేరారు. వీరిలో 21.46 లక్షల మంది మొబైల్‌ సెగ్మెంట్, 1.44 లక్షల మంది ఫిక్సిడ్‌ లైన్‌ సెగ్మెంట్‌ యూజర్లు ఉన్నారు. జూన్‌లో నికరంగా 62 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ జత కాగా ఇందులో 54.54 లక్షల మంది టాప్‌ రెండు టెలికం దిగ్గజాలైన ఎయిర్‌టెల్, జియోకి చెందిన వారే ఉన్నారు. వొడాఫోన్‌ ఐడియాలో నికరంగా 1.64 లక్షల మంది వైర్‌లెస్‌ సబ్‌స్క్రైబర్స్‌ చేరగా, ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌లో 94,006 యూజర్లు జతయ్యారు. ఎంటీఎన్‌ఎల్‌లో 11,284 మంది తగ్గారు.  

1,580 మంది ఆపరేటర్లు దాఖలు చేసిన సమాచారం ప్రకారం మే నెలలో 108 కోట్లుగా ఉన్న బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్ల సంఖ్య జూన్‌లో 108.75 కోట్లకు చేరింది. మొత్తం మీద 53.22 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లతో జియో అగ్రస్థానంలో ఉండగా, ఎయిర్‌టెల్‌కి 37.99 కోట్ల మంది, వొడాఫోన్‌ ఐడియాకి 13 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ 2.7 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.

ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ!

#

Tags : 1

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)