Breaking News

సేమ్‌ షాక్‌: ఎయిర్‌టెల్‌లోనూ ఆ ప్లాన్‌ కనుమరుగు

Published on Wed, 08/20/2025 - 21:34

టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్‌టెల్ తన ఎంట్రీ సెగ్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను నిలిపివేసింది. ప్రత్యర్థి సంస్థ జియో కూడా రూ.249 ధర గల ఎంట్రీ లెవల్ ప్లాన్ ను నిలిపివేసింది. ఎక్కువ మంది రీచార్జ్‌ చేసుకునే ఈ ప్లాన్ ను ఎయిర్‌టెల్ నిశ్శబ్దంగా కనుమరుగు చేసింది. ఇప్పుడు వారు రూ .299 ధర గల ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్ ను ఎంచుకోవలసి వచ్చింది.

ఎయిర్ టెల్ నిలిపివేసిన ఈ ప్లాన్ ధర రూ.249. ఇది 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను అందించేది. ముఖ్యంగా, ఇది వినియోగదారులకు ఉచిత హలోట్యూన్స్, ప్రో ఏఐ, ఎక్స్‌ట్రీమ్ ప్లే వంటి ప్రయోజనాలను కల్పించేది. 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటాను అందించే రూ.249 ప్లాన్ ను జియో కూడా ఇటీవల తొలగించింది. జియోలో ఇకపై 1 జీబీ రోజువారీ డేటా లిమిట్‌తో ఎలాంటి ప్లాన్ లేదు. చౌకైన 28 రోజుల ప్లాన్ ఇప్పుడు రూ .299 నుండి ప్రారంభమవుతుంది. ఇది రోజుకు 1.5 జిబి డేటాను అందిస్తుంది.

ఈ చర్య ఎయిర్‌ల్, జియోలకు సగటు వినియోగదారుడి ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) పెంచుతుండగా, సామాన్యులపై ఖరీదైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల భారం పడుతోంది. ఈ రెండు టెలికాం ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రైవేట్‌ టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా కూడా అనుసరించే అవకాశం ఉంది.

#

Tags : 1

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)