Breaking News

ఎయిర్‌టెల్‌ సైలెంట్‌ షాక్‌! పాపులర్‌ ప్లాన్‌ తొలగింపు

Published on Fri, 07/17/2026 - 18:47

దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ తన పోస్ట్‌పెయిడ్‌ పోర్ట్‌ఫోలియోలో కీలక మార్పు చేసింది. వ్యక్తిగత వినియోగదారుల కోసం అందుబాటులో ఉన్న రూ.549 పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ను సైలెంట్‌గా తొలగించింది. ప్రస్తుతం ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎయిర్‌టెల్ థ్యాంక్స్‌ యాప్‌లో కూడా కనిపించడం లేదు. అయితే ఈ మార్పుపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఈ నిర్ణయంతో ఇప్పుడు కొత్త పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు రూ.449 వ్యక్తిగత ప్లాన్‌ ఎంట్రీ-లెవల్‌ ఎంపికగా మిగిలింది. మరోవైపు, రూ.549 కంటే ఎక్కువ ప్రయోజనాలు కోరుకునే కస్టమర్లు నేరుగా రూ.699 ఫ్యామిలీ ప్లాన్‌ను ఎంచుకోవాల్సి వస్తుంది. దీంతో ఎయిర్‌టెల్‌ తన అధిక ధరల ఫ్యామిలీ ప్లాన్‌ల వైపు వినియోగదారులను మళ్లించే ప్రయత్నం చేస్తోందని టెలికాం రంగ నిపుణులు భావిస్తున్నారు.

రూ.449 ప్లాన్‌లో ఏమున్నాయి?

రూ.449 వ్యక్తిగత పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లో అపరిమిత 4G/5G డేటా, అన్‌లిమిటెడ్‌ లోకల్‌, ఎస్‌టీడీ, నేషనల్‌ రోమింగ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అదనంగా 3 నెలల ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం, 6 నెలల పాటు 100 GB గూగుల్‌ వన్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌, ఏడాది పాటు అడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం, ఉచిత హలో ట్యూన్స్‌, బ్లూ రిబ్బన్‌ బ్యాగ్‌ ట్రాకింగ్‌, అలాగే 5G ఫాస్ట్‌ లేన్‌, స్పామ్‌ కాల్‌ అలర్ట్స్‌, ఫ్రాడ్‌ లింక్‌ బ్లాకింగ్‌, OTP అలర్టుల వంటి భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

రూ.699 ఫ్యామిలీ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలు

రూ.699 ఫ్యామిలీ ప్లాన్‌లో ఒక మెయిన్‌ కనెక్షన్‌తో పాటు ఒక ఉచిత యాడ్‌-ఆన్‌ సిమ్‌ లభిస్తుంది. అంటే ఇద్దరు సభ్యులు ఈ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చు. ప్రతి కనెక్షన్‌కు సగటున సుమారు రూ.350 ఖర్చు మాత్రమే అవుతుంది. ఇందులో కూడా అపరిమిత 4G/5G డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అదనంగా 6 నెలల అమెజాన్‌ ప్రైమ్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌, 12 నెలల జియో హాట్‌ స్టార్‌ మొబైల్‌, 6 నెలల గూగుల్‌ వన్‌ (100GB), 3 నెలల ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం, ఏడాది పాటు అడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం వంటి ఓటీటీ ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే హలో ట్యూన్స్‌, బ్లూ రిబ్బన్‌ బ్యాగ్‌ ట్రాకింగ్‌, అలాగే 5G ఫాస్ట్‌ లేన్‌, స్పామ్‌ డిటెక్షన్‌, ఫ్రాడ్‌ లింక్‌ బ్లాకింగ్‌, OTP అలర్ట్స్‌ వంటి సేవలు కూడా కొనసాగుతాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)