Breaking News

భారత్‌లోని తొలి టెలికాం సంస్థగా రికార్డు సృష్టించిన ఎయిర్‌టెల్‌..!

Published on Thu, 11/25/2021 - 16:18

దేశవ్యాప్తంగా పలు దిగ్గజ టెలికాం సంస్థలు 5జీ టెక్నాలజీపై వేగంగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా లాంటి సంస్థలు 5జీ ట్రయల్స్‌ను ముమ్మరం చేశాయి. తాజాగా ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ 5జీ ట్రయల్స్‌ విషయంలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. 700MHz బ్యాండ్‌తో దేశంలో 5జీ ట్రయల్స్‌ టెస్ట్‌ను నిర్వహించిన తొలి టెలికాం సంస్థగా ఎయిర్‌టెల్‌ నిలిచింది.5జీ ట్రయల్స్‌ టెస్ట్‌ను నోకియా భాగస్వామ్యంతో విజయవంతంగా పూర్తి చేసింది. ఈ టెస్ట్‌ను కోల్‌కత్తా నగర శివార్లలో నిర్వహించింది. ఈస్ట్రన్‌ ఇండియాలో నిర్వహించిన తొలి టెస్ట్‌ కూడా ఇదే.     

700 MHz బ్యాండ్ సహాయంతో ఎయిర్‌టెల్‌, నోకియా కంపెనీలు రియల్‌టైమ్‌ పరిస్ధితుల్లో రెండు 3GPP ప్రామాణిక 5G  ప్రాంతాల మధ్య 40 కి.మీల హై-స్పీడ్ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ కవరేజీని సాధించగలిగాయి. ఈ ట్రయల్స్‌లో భాగంగా ఎయిర్‌టెల్‌ నోకియాకు చెందిన 5G పోర్ట్‌ఫోలియో పరికరాలను  వాడింది. ఈ సందర్భంగా ఎయిర్‌టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సింగ్ సెఖోన్ మాట్లాడుతూ...5జీ టెక్నాలజీలో భాగంగా  కంపెనీ భారత మొట్టమొదటి 700 MHz బ్యాండ్‌లో 5జీ డెమోను నిర్వహించిన తొలి కంపెనీగా ఎయిర్‌టెల్‌ నిలిచిందని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో, ఎయిర్‌టెల్‌ ప్రత్యక్ష 4G నెట్‌వర్క్ సహాయంతో తొలి  5G టెక్నాలజీ  అనుభవాన్ని ప్రదర్శించింది. 
చదవండి: అడిడాస్‌ సంచలనం..! ఫేస్‌బుక్‌తో పోటాపోటీగా మెటావర్స్ పై కసరత్తు

#

Tags : 1

Videos

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

ప్రభాస్ స్పిరిట్ కోసం ఈ ముగ్గురిలో ఎవరు..?

మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు

స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?

నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సందిగ్ధత

రాజధాని రివర్స్.. వద్దు మొర్రో అన్నా వినలేదు

అనకాపల్లి జిల్లా టీడీపీ మహానాడు సభ అట్టర్ ఫ్లాప్

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం

మళ్లీ అదే తీరు దక్షిణాఫ్రికా అధ్యక్షుడి రమఫొసాతో ట్రంప్ వాగ్వాదం

స్కామ్ స్టార్ బాబు అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసిన YS జగన్ మోహన్ రెడ్డి

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)