Breaking News

చేతులు కలిపిన ఎయిర్‌టెల్, ఐబీఎం..

Published on Thu, 10/16/2025 - 18:41

టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్, అమెరికన్‌ ఐటీ దిగ్గజం ఐబీఎం చేతులు కలిపాయి. ముంబై, చెన్నైలో ఎయిర్‌టెల్‌ క్లౌడ్‌ కోసం రెండు మల్టీజోన్‌ రీజియన్లను (ఎంజీఆర్‌) నెలకొల్పేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. క్లౌడ్‌ సర్వీసుల కోసం పెద్ద సంఖ్యలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఎంజీఆర్‌గా వ్యవహరిస్తారు.

దేశీయంగా ఎయిర్‌టెల్‌ క్లౌడ్‌ లభించే జోన్ల సంఖ్యను ప్రస్తుత నాలుగు నుంచి పదికి పెంచుకోనున్నట్లు భారతి ఎయిర్‌టెల్‌ వైస్‌ చైర్మన్‌ గోపాల్‌ విఠల్‌ తెలిపారు. ఐబీఎం క్లౌడ్‌ సొల్యూషన్స్‌ను ఎయిర్‌టెల్‌ క్లౌడ్‌ కస్టమర్లు పోర్ట్‌ఫోలియో యాజ్‌ ఏ సర్వీస్‌ కింద ఉపయోగించుకునేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంది. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు టెక్నాలజీ విషయంలో స్వతంత్రతను కోరుకుంటున్న నేపథ్యంలో తమ సంస్థకు వ్యాపార అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని ఐబీఎం ఆసియా పసిఫిక్‌ జనరల్‌ మేనేజర్‌ హాన్స్‌ డెకర్స్‌ తెలిపారు.

ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు

  • ముంబై, చెన్నై నగరాల్లో ఎయిర్‌టెల్ క్లౌడ్ కోసం రెండు మల్టీజోన్ రీజియన్లు (MGRs) స్థాపించనున్నారు.

  • ఇవి విస్తృత స్థాయిలో క్లౌడ్ సేవలు అందించగల నెట్‌వర్క్-కేంద్రిత డేటా సెంటర్ల సమాహారంగా పనిచేస్తాయి.

  • ఎంజీఆర్‌లు అధిక స్థాయిలో లభ్యత, డేటా రిజిలియెన్సీ, డేటా ప్రాసెసింగ్ వేగాన్ని అందిస్తాయి.

  • ప్రస్తుతం నాలుగు క్లౌడ్ జోన్లతో ఉన్న ఎయిర్‌టెల్, వాటిని  పదికు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది.

  • ఇది దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలకు, ప్రభుత్వ విభాగాలకు మరింత వేగవంతమైన, నమ్మదగిన క్లౌడ్ సేవలను అందించగలదు.

  • ఐబీఎంకు చెందిన అధునాతన సాంకేతికతలను “పోర్ట్‌ఫోలియో యాస్‌ ఏ సర్వీస్‌” రూపంలో ఎయిర్‌టెల్ క్లౌడ్ కస్టమర్లు వినియోగించవచ్చు.

  • ఇది కస్టమర్లకు స్కేలబులిటీ, డేటా కంట్రోల్, ఏఐ సామర్థ్యాలు వంటి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)