Breaking News

ఎయిరిండియా పరివర్తనకు పదేళ్లు పడుతుంది..

Published on Wed, 07/29/2026 - 06:02

న్యూఢిల్లీ: విమానయాన దిగ్గజం ఎయిరిండియా పరివర్తనకు కనీసం అయిదు నుంచి పదేళ్లు పడుతుందని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. అనేక సంవత్సరాలుగా కీలక విడిభాగాల సరఫరాలో అవాంతరాలు ఏర్పడిన నేపథ్యంలో సిస్టమ్‌లు, సంస్కృతి, విమానాలు, భారీ స్థాయిలో నిపుణులను తీర్చిదిద్దుకోవడానికి అంత సమయం అవసరమవుతుందని వివరించారు. ఇప్పటికే ఈ దిశగా గణనీయంగా పురోగతి సాధించామని టాటా సన్స్‌ 2025–26 వార్షిక నివేదికలో ఆయన పేర్కొన్నారు.

‘ఎయిరిండియాను పునర్నిర్మించడమనేది సుదీర్ఘ ప్రయాణం. ఫ్లీట్‌ రెన్యువల్, శిక్షణ, సర్వీసులను గాడిలో పెట్టడం, నెట్‌వర్క్‌ని విస్తరించడం.. ఇలా ఎన్నో ఉంటాయి. ఘనచరిత్ర గల ప్రతి ఎయిర్‌లైన్‌ నిర్మాణానికి దశాబ్దాల కాలం పట్టేసింది. ఏవో కొన్ని త్రైమాసికాల్లో జరిగిపోలేదు‘ అని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రధానంగా మూడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనాల్సి వచ్చిందని చంద్రశేఖరన్‌ చెప్పారు.

గగనతలం మూసివేత, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇంధన ధరలు పెరిగిపోవడం.. విదేశీ మారక విలువలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కావడం, ఏఐ171 విమానం కూలిపోవడంలాంటి అంశాలతో గత ఆర్థిక సంవత్సరం ఎయిరిండియాకు సవాళ్లతో కూడుకున్నదిగా గడిచిందని తెలిపారు. అయితే, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఎయిరిండియా సిబ్బంది దీటుగా స్పందించారని ఆయన తెలిపారు. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను 2022 జనవరిలో ప్రభుత్వం నుంచి టాటా సన్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)