Breaking News

ఎయిర్‌లైన్స్ విలీనం.. 700 మంది తొలగింపు!!

Published on Wed, 07/10/2024 - 19:38

ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ త్వరలో కలిసిపోతున్నాయి. ఈ రెండు విమానయాన సంస్థల విలీనం వందలాది మంది ఉద్యోగాలపై మీదకు వచ్చింది. ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ రెండింటిలో కనీసం 700 మంది ఉద్యోగులను తొలగించబోతున్నారు. ఇద్దరు అధికారుల ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్ నాటికి దీని అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అయితే రిటైర్‌మెంట్‌కు చేరుకుంటున్న ఉద్యోగులు, నిర్ణీత కాల ఒప్పందాలు ఉన్న ఉద్యోగులు ఇందులో ఉండరని ఆ ఇద్దరు అధికారులు తెలిపారు. హెచ్‌టీ లైవ్ నివేదిక ప్రకారం.. సుమారు 18,000 మంది ఉద్యోగులున్న ఎయిర్ ఇండియా విస్తారాతో విలీనం కానుంది. ఇందుకోసం దాదాపు 6000 మంది విస్తారా ఉద్యోగులను విలీన యూనిట్‌లో చేయాల్సి ఉంటుంది.

“అంతర్గత ఫిట్‌మెంట్ ప్రక్రియ పూర్తయింది. త్వరలో తొలగింపుల  ప్రకటన ఉంటుంది. స్థిర-కాల ఒప్పందాలు ఉన్న ఉద్యోగులు, త్వరలో పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు మినహా ఎయిర్ ఇండియా, విస్తారా రెండింటిలో దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది" ఒక అధికారి తెలిపారు.

అదే సమయంలో పనితీరు ఆధారంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు మరో అధికారి తెలిపారు. "నాన్-ఫ్లైయింగ్ ఫంక్షన్‌లలోని ఉద్యోగులకు సంస్థాగత అవసరాలు, వ్యక్తిగత యోగ్యత ఆధారంగా ఉద్యోగాల కేటాయింపు ఉంటుంది" అని మూడో అధికారి చెప్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)