Breaking News

ట్రక్కు క్యాబిన్లలో ఏసీ తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌

Published on Sun, 12/10/2023 - 19:21

సరకు రవాణా చేసే ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్‌లను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.  2025 అక్టోబర్ 1, ఆ తర్వాత తయారయ్యే ఎన్‌2, ఎన్‌3 కేటగిరి ట్రక్కులలో డ్రైవర్‌ల కోసం ఏసీ క్యాబిన్‌లు తప్పనిసరి చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

3.5 టన్నుల నుంచి 12 టన్నులు బరువుండే ట్రక్కులు ఎన్‌2 కేటగిరీ కిందకు, 12 టన్నులు దాటిన ట్రక్కులు ఎన్‌3 కేటగిరీ కిందకు వస్తాయి. డ్రైవర్లకు మెరుగైన పని వాతావరణం కల్పించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

ట్రక్కు క్యాబిన్లలో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలను తప్పనిసరి చేసేందుకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు ఆమోదం లభించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గత జులైలోనే తెలిపారు. దేశానికి అత్యంత ముఖ్యమైన రంగాలలో ఒకటైన రవాణా రంగంలో ట్రక్ డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి పని పరిస్థితులు, మానసిక స్థితికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)