Breaking News

ఏఐతో మరిన్ని అవకాశాలు 

Published on Fri, 02/27/2026 - 06:35

ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) రాకతో ఉద్యోగాలు పోతాయనే భయపడనక్కర్లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ చెప్పారు. దీనితో ఉద్యోగ విధుల స్వభావం మాత్రమే మారుతుందని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. దేశీయంగా ఉద్యోగాలపై ఏఐ ప్రతికూల ప్రభావం గురించి తనకెలాంటి ’ఆందోళన’ లేదని ఆయన చెప్పారు. 

2000లో వై2కే సమస్య తలెత్తినప్పుడు భారత్‌కి ఎలాగైతే మంచి అవకాశాలు లభించాయో, అదే విధంగా ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీతో కంపెనీలకు మరిన్ని వ్యాపార అవకాశాలు లభించగలవని మంత్రి తెలిపారు. 60 లక్షల ఉద్యోగాలు, 315 బిలియన్‌ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమపై ఏఐ ప్రభావం గురించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

మరింత మెరుగ్గా మారడానికి ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. టెక్నాలజీని వినియోగించే కొద్దీ మానవ నైపుణ్యాలు, ప్రతిభావంతుల అవసరం మరింతగా పెరుగుతుందని, తద్వారా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. ఏఐతో లాభాలు, ఎగుమతులు పెరుగుతాయని, 23 లక్షలకు పైగా సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మ్యాథ్స్‌ గ్రాడ్యుయేట్స్‌ వీటిని అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఇటీవల కుదుర్చుకున్న తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోవలోనే ప్రపంచంతో భారత్‌ మరింతగా అనుసంధానమయ్యేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు.  
 

Videos

విజయు ఎఫైర్ ఉంది.. విడాకులు కోరిన దళపతి భార్య

మొదటి సారి సీఎం అయినప్పుడు అసెంబ్లీలో ఎవ్వరికి తెలియని పచ్చి నిజం

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

పెళ్లి సీజన్‌లో ఊరట.. 22, 24 క్యారెట్ల బంగారం ధరలు తగ్గింపు

లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ కన్నీళ్లు పెట్టుకున్న కేజీవాల్

ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన 'విరోష్‌' జోడీ

చిలుకూరులో విషాదం ఆలయ ప్రధాన అర్చకులు ఇకలేరు

అవినీతి, అరాచక పాలనతో కాంగ్రెస్ సర్కార్

కోల్‌కతాలో భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

Mangalagiri : జనసేన ఆఫీస్ లో దాడి.. కారు అద్దాలు ధ్వంసం

Photos

+5

జాలీగా గడిపేస్తున్న మెహరీన్‌ (ఫోటోలు)

+5

పిల్లాడే కాదు, మేమూ మిస్‌ అవుతాం: కాజల్‌ (ఫోటోలు)

+5

బ్లాక్‌ చీరలో నటి నివేథా థామస్.. గ్లామ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

నాని 'ది ప్యారడైజ్' HD మూవీ స్టిల్స్‌

+5

ఈ అమ్మడి అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే (ఫొటోలు)

+5

ప్రియుడితో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఇదిగో విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు

+5

ఒకదానికొకటి సంబంధమే లేదు.. మీనాక్షి చౌదరి ఫన్నీ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్‌ ఏనుగులతో రీతూవర్మ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)