ఏఐ నిపుణులకు భారీగా డిమాండ్‌ 

Published on Sun, 10/26/2025 - 05:28

ముంబై: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) నిపుణులకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోంది. గ్లోబల్‌ హైరింగ్‌ ప్లాట్‌ఫాం ఇండీడ్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఏఐ సంబంధ జాబ్‌ పోస్టింగ్స్‌ 11.7 శాతం మేర పెరగడం ఇందుకు నిదర్శనం. గతేడాది సెప్టెంబర్‌లో ఇది 8.2 శాతంగా నమోదైంది. తమ ప్లాట్‌ఫాంలో జాబ్‌ పోస్టింగ్‌ల ఆధారంగా ఇండీడ్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 

దీని ప్రకారం సెప్టెంబర్‌లో 11.7 శాతం పోస్టింగ్స్‌లో ప్రత్యేకంగా ఏఐని ప్రస్తావించారు. తమకు కీలకమైన భారత మార్కెట్‌ తర్వాత సింగపూర్‌లో మాత్రమే ఏఐ నిపుణులకు ఈ స్థాయిలో డిమాండ్‌ కనిపించినట్లు ఇండీడ్‌ ఏపీఏసీ సీనియర్‌ ఎకానమిస్ట్‌ క్యాలమ్‌ పికరింగ్‌ తెలిపారు. ఏఐ ఆధారిత ఉద్యోగావకాశాలు ప్రధానంగా టెక్‌ రంగంలోనే ఉన్నప్పటికీ, క్రమంగా ఇతర రంగాల్లోను పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. 

నివేదికలో మరిన్ని విశేషాలు.. 
→ దాదాపు 39 శాతం డేటా, అనలిటిక్స్‌ ఉద్యోగాల పోస్టింగ్స్‌లో ఏఐ ప్రస్తావన ఉంది. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ (23 శాతం), బీమా (18 శాతం), సైంటిఫిక్‌ రీసెర్చ్‌ (17 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 
→ పలు ఇంజినీరింగ్‌ కేటగిరీల్లో సర్వసాధారణంగా ఏఐ నైపుణ్యాలకు డిమాండ్‌ నెలకొంది. ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ (17 శాతం), మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (11 శాతం), ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ (9.2 శాతం) ఈ కేటగిరీల్లో ఉన్నాయి.  
→ దేశీయంగా ఉద్యోగులు క్రమంగా సంఘటిత ఉద్యోగాల వైపు మళ్లుతున్నారు. 
→ ఏఐ కారణంగా హైరింగ్‌ స్వరూపం మారుతున్న నేపథ్యంలో అత్యధిక నైపుణ్యాలున్న, స్పెషలైజ్డ్‌ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. చాలా మటుకు సంస్థలు, డేటా అనలిటిక్స్, ఆటోమేషన్‌ మొదలైన ఏఐ సంబంధ టూల్స్‌పై గట్టి పట్టున్న అభ్యర్ధులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.   

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)