విజయ్ కి అడుగడుగునా అడ్డంకులు, గవర్నర్ తీరుపై సీపీఐ, కాంగ్రెస్ సీరియస్
Breaking News
500 మందిని తొలగించిన టెక్ కంపెనీ
Published on Wed, 05/06/2026 - 14:56
సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న ప్రకంపనలు మరోసారి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రముఖ బిజినెస్ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘ఫ్రెష్‌వర్క్స్’ తాజాగా తన ఉద్యోగుల్లో 11 శాతం మందిని, అంటే దాదాపు 500 మందిని తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతున్న తరుణంలో తాజా నిర్ణయం పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
ఎందుకు ఈ నిర్ణయం?
ఏఐ రంగంలో చోటుచేసుకుంటున్న వేగవంతమైన మార్పులకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకునే క్రమంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనిపై ఫ్రెష్‌వర్క్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) డెన్నిస్ వుడ్‌సైడ్ స్పష్టతనిచ్చారు. ‘మా కోడింగ్ ప్రక్రియలో ఇప్పటికే సగానికి పైగా ఏఐ ద్వారానే జరుగుతోంది. ఆటోమేషన్ వల్ల సాంకేతిక విభాగాల్లోని సాధారణ పనులు గణనీయంగా తగ్గాయి. ఈ మార్పులను సమర్థవంతంగా నిర్వహించడానికి లేఆఫ్స్ అవసరం ఏర్పడింది’ అని ఆయన వివరించారు.
పునర్నిర్మాణ వ్యూహం
ఈ తొలగింపుల వల్ల కంపెనీపై సుమారు 8 మిలియన్ డాలర్ల భారం పడనుందని అంచనా. అయితే, ఈ పొదుపు ద్వారా వచ్చిన నిధులను కంపెనీ తన ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ అయిన ‘ఫ్రెష్‌సర్వీస్’ వంటి వ్యాపార విభాగాల్లో తిరిగి పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. ఆటోమేషన్ ద్వారా కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం.
ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన
Tags : 1