2030 నాటికి 15.7 ట్రిలియన్ డాలర్లు.. ప్రపంచ జీడీపీకి ఏఐ శక్తి

Published on Wed, 09/10/2025 - 21:13

న్యూఢిల్లీ: కృత్రిమ మేధస్సు (AI) 21వ శతాబ్దాన్ని నిర్వచించే సాంకేతికతగా ఎదుగుతోంది. 2030 నాటికి ప్రపంచ జీడీపీలో సుమారు 15.7 ట్రిలియన్ డాలర్లను ఏఐ జోడించనుందని ఫీక్కీ-బీసీజీ  విడుదల చేసిన "ది గ్లోబల్‌ ఏఐ రేస్‌" నివేదిక వెల్లడించింది.

ఏఐ స్వీకరణలో అభివృద్ధి చెందిన దేశాలు ముందంజలో ఉన్నాయి. 66% దేశాలు జాతీయ ఏఐ వ్యూహాలను రూపొందించగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది 30 శాతంగా ఉంది. ఇక తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది కేవలం 12% మాత్రమే. ఈ అసమానత విదేశీ దిగుమతులపై ఆధారపడే ప్రమాదాన్ని పెంచుతోంది.

ఏఐ స్వీకరణ రేస్‌లో కంప్యూట్‌, డేటా, మోడల్స్‌, టాలెంట్‌ అనే నాలుగు కీలక అంశాలు ఉన్నాయి. అమెరికా, చైనా వంటి దేశాలు ఏఐ నిపుణులలో ఆధిపత్యం కలిగి ఉన్నాయి. వ్యవసాయం, ప్రజా సేవలు వంటి రంగాలు ఏఐ స్వీకరణలో ఇంకా వెనుకబడ్డాయి.

వ్యవసాయ రంగంలో ఏఐ ద్వారా 20% ఉత్పత్తి వృద్ధి సాధ్యమవుతుంది. అయితే, సంస్థలు పెట్టుబడులు పెట్టినా ఏఐ పైలట్‌లు క్షేత్రస్థాయికి వెళ్లకముందే సగం విఫలమవుతున్నాయి. రైజ్‌ (రీసెర్చ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌, స్కిల్లింగ్‌, ఎథిక్స్‌) ఫ్రేమ్‌వర్క్‌ ద్వారా ప్రభుత్వాలు ఏఐ స్వీకరణ పెంపుపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ సహకారం, మౌలిక సదుపాయాలు, నైపుణ్య అభివృద్ధి, నైతిక పాలన అవసరం.

"ఏఐ కేవలం సాంకేతిక తరంగం మాత్రమే కాదు.ఇది రాబోయే దశాబ్దాలలో ఆర్థిక, సామాజిక నాయకత్వాన్ని నిర్వచించే వ్యూహాత్మక పోటీ. ఏఐ అనేది ప్రయోజనం కోసం జరిగే పోటీ మాత్రమే కాదు. ప్రపంచానికి విలువను పెంచే పురోగతికి సమిష్టి అన్వేషణ" అని ఫీక్కీ డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్ పేర్కొన్నారు.

#

Tags : 1

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)