తీన్మార్ మల్లన్న నాపై అసభ్య కామెంట్స్ చేశారు: ఎమ్మెల్సీ కవిత
Breaking News
ఐపీవోకు ఇన్‌ఫ్రా పరికరాలు అద్దెకిచ్చే కంపెనీ
Published on Sat, 07/12/2025 - 08:45
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరికరాలను అద్దెకిచ్చే అగ్‌కాన్ ఎక్విప్‌మెంట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 332 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్లు 94 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు.
ఇదీ చదవండి: వాణిజ్య బీమాపై జ్యూరిక్ కోటక్ ఫోకస్
ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 168 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 84 కోట్లు పరికరాల కొనుగోళ్లకు, మరికొన్ని నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 2003లో ఏర్పాటైన హర్యానా కంపెనీ ప్రధానంగా మౌలిక రంగ కంపెనీలకు పరిశ్రమ సంబంధిత పరికరాలను అద్దె ప్రాతిపదికన సమకూర్చుతుంది. గతేడాది(2024–25) ఆదాయం 20 శాతం ఎగసి రూ. 164 కోట్లను తాకగా.. నికర లాభం 36 శాతం జంప్‌చేసి రూ. 31 కోట్లకు చేరింది.
Tags : 1