Breaking News

భారత్‌లో వియత్నాం కంపెనీ: 3000 ఉద్యోగాలు..

Published on Tue, 08/05/2025 - 21:15

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ఇండియావైపు చూస్తున్నాయి. ఇటీవలే టెస్లా దేశీయ విఫణిలో తన మొదటి కారును లాంచ్ చేసింది. ఇప్పుడు వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ (VinFast) తమిళనాడులోని ఎలక్ట్రిక్ వాహన ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ సంస్థ భారతదేశంలో తన ఉనికిని మరింత విస్తరించడానికి సన్నద్ధమవుతోంది.

తూత్తుకుడిలోని విన్‌ఫాస్ట్ కర్మాగారం ప్రారంభంలో సంవత్సరానికి 50,000 ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తుంది. అయితే ఈ ప్లాంట్ ఉత్పత్తిని మూడు రెట్లు పెంచి ఏడాదికి 1,50,000 కార్లకు తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తమిళనాడులో ఓడరేవులు ఉండడం వల్ల.. ఎగుమతికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో ఎగుమతులకు కేంద్రంగా చేసుకోవడానికి కంపెనీ ఆలోచిస్తోంది. అంతే కాకుండా.. ఈ కర్మాగారం ద్వారా సుమారు 3,000 కంటే ఎక్కువ మంది స్థానికులకు ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంది.

విన్‌ఫాస్ట్ తమిళనాడును ఎంచుకోవడానికంటే ముందు భారతదేశంలో ఆరు రాష్ట్రాలలో 15 ప్రదేశాలను పరిశీలించినట్లు కంపెనీ తెలిపింది. తయారీకి మాత్రమే కాకుండా.. ఎగుమతులకు కూడా ఈ రాష్ట్రం అనుకూలంగా ఉండటం చేత సంస్థ ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)