సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు
Breaking News
ఓఎన్‌డీసీలోకి మీషో, ఎందుకో తెలుసా?
Published on Thu, 11/24/2022 - 09:25
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ మీషో తాజాగా ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ)లో చేరింది. కొనుగోలుదారులను హైపర్‌లోకల్ విక్రేతలకు అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడ గలదని సంస్థ తెలిపింది. తమ పైలట్ ప్రాజెక్టు ముందుగా బెంగళూరులో ప్రారంభమై తర్వాత మిగతా నగరాలకు విస్తరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే తెలిపారు. (ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ 150: ధర ఎంతంటే?)
మీషోలో 8 లక్షల మంది పైగా విక్రేతలు ఉన్నారు. విక్రేతలు, వినియోగదారుల వ్యయాల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఓఎన్‌డీసీని తెరపైకి తెచ్చింది. ఆన్‌లైన్‌లో తక్కువ రేట్లకు ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలుదారులు దక్కించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉంది. (Satyam Scam:హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు)
Tags : 1