Breaking News

లేఆఫ్‌ బాటలో ‘పేపాల్‌’.. 2వేల మంది ఉద్యోగుల తొలగింపు!

Published on Wed, 02/01/2023 - 20:55

టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతోంది. వేలాదిగా ఉద్యోగులను వదిలించుకుంటున్న గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ కంపెనీల బాటలో ప్రముఖ ఆన్‌లైన్‌ చెల్లింపుల వేదిక ‘పేపాల్‌’ పయనిస్తోంది. మందగించిన ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపుతూ దాదాపు 2వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. 

2వేల మందిని లేదా మొత్తం ఉద్యోగుల్లో 7 శాతం మందిని తొలగించనున్నట్లు కంపెనీ యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. స్థూల ఆర్థిక పరిస్థితుల్లో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈఓ డ్యాన్‌ షుల్మన్‌  పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యయాన్ని తగ్గించుకుని ప్రధాన లక్ష్యాల సాధనపై మరింత దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.

పేపాల్‌ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 429 మిలియన్‌ మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. ఎక్కువ మంది యూక్టివ్ యూజర్లు గల కంపెనీల జాబితాలో 5వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నేపథ్యంలో పేపాల్‌ సంస్థ గత నవంబర్‌లో తమ కంపెనీ రెవెన్యూ వృద్ధి అంచనాను తగ్గించుకుంది.

కొనసాగుతున్న లేఆఫ్స్‌ పరంపర
12వేల మందిని తొలగిస్తున్నట్లు గూగుల్‌  గత నెలలోనే ప్రకటించింది. అదే బాటలో మైక్రోసాఫ్ట్‌ 10వేల మందిని, సేల్స్‌ ఫోర్స్‌ 7వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశీయ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ కంపెనీ స్పోటిఫై దాదాపు 10వేల మందిని తొలగిస్తున్నట్లు గత వారమే వెల్లడించింది.
చదవండి: బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..?

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)