Breaking News

ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ విలీనం పూర్తి.. కంపెనీ ఇకపై..

Published on Wed, 04/02/2025 - 20:33

పూర్తి అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ను విలీనం చేసుకునే ప్రక్రియ పూర్తయినట్లు ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ (ఏబీసీఎల్‌) వెల్లడించింది. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆదేశాల మేరకు ఇది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లవుతుందని పేర్కొంది.

ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ను మాతృ సంస్థలో విలీనం చేయాలని గతేడాది మార్చిలో నిర్ణయం తీసుకున్నారు. విలీన సంస్థకు ఎండీ, సీఈవోగా విశాఖ మూల్యే, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా రాకేశ్‌ సింగ్‌ వ్యవహరిస్తారు. దీంతోపాటు నగేష్ పింగే, సునీల్ శ్రీవాస్తవ్ లను కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

2024 డిసెంబర్ 31 నాటికి రూ .5.03 లక్షల కోట్లకుపైగా ఆస్తులు ఏబీసీఎల్ నిర్వహణలో ఉన్నాయి. వీటిలో రూ .1.46 లక్షల కోట్లకు పైగా ఏకీకృత రుణాలు ఉ‍న్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 9 నెలల కాలంలో కంపెనీ జీవిత, ఆరోగ్య బీమా వ్యాపారాలలో రూ .16,942 కోట్ల స్థూల ప్రీమియంను ఆర్జించింది. అదే సమయంలో రూ.28,376 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని, రూ.2,468 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ఆర్జించింది. 2024 డిసెంబర్ 31 నాటికి కంపెనీ అన్ని వ్యాపారాలలో 1,482 శాఖలు, 2 లక్షలకు పైగా ఏజెంట్లు / ఛానల్ భాగస్వాములతో పాటు అనేక బ్యాంక్ భాగస్వాములతో దేశవ్యాప్త ఉనికిని కలిగి ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)