Breaking News

అడిడాస్‌లో లేఆఫ్‌లు.. ఒకే దెబ్బకు సగానికిపైగా..

Published on Thu, 09/17/2026 - 08:52

ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం అడిడాస్ తమ సంస్థాగత పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా భారత్‌లో ఉద్యోగ కోతలు చేపట్టింది. హరియాణాలోని గురుగ్రామ్‌లో ఉన్న కంపెనీ ఇండియా టెక్నాలజీ హబ్‌లో దాదాపు 350 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేంద్రంలో ఉన్న మొత్తం 700 మంది ఉద్యోగుల్లో దాదాపు 50 శాతం మందిపై ఈ లేఆఫ్‌ల ప్రభావం పడింది.

ఇటీవల నిర్వహించిన టౌన్‌హాల్ సమావేశంలో యాజమాన్యం ఈ నిర్ణయాన్ని ఉద్యోగులకు అధికారికంగా వెల్లడించింది. తొలగింపునకు గురైన వారిలో ప్రధానంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజినీర్లు ఉన్నారు. బాధితులను రెండు విభాగాలుగా వర్గీకరించారు. మొదటి గ్రూప్ ఉద్యోగులకు వెంటనే ఎగ్జిట్ లెటర్లు అందజేయగా, రెండో గ్రూప్‌నకు డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. ఈ సమయంలో వారు ఇతర హబ్‌ల్లోని సహచరులకు నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్(కేటీ) పూర్తి చేయాల్సి ఉంటుంది.

సంస్థాగత మార్పులు.. యాజమాన్యం స్పందన

ఈ నిర్ణయాన్ని అడిడాస్ అధికారిక ప్రకటన ద్వారా ధ్రువీకరించింది. ‘మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆపరేటింగ్ మోడల్‌ను పునర్నిర్మించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’ అని పేర్కొంది. వ్యాపార నిర్వహణను మరింత సరళతరం చేయడంతో పాటు క్లిష్టమైన సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికే ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది. అదే సమయంలో, భారత మార్కెట్ తమకు ఎంతో వ్యూహాత్మకంగా కీలకమైనదని, ఇక్కడి డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆవిష్కరణలలో టెక్ హబ్ పాత్ర కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. బాధితులకు తగిన పరిపరిహారంతో పాటు కెరీర్ ట్రాన్సిషన్ సాయం అందిస్తామని ప్రకటించింది.

ఇదీ చదవండి: బోరుమని ఏడ్చేసిన నిర్మలా సీతారామన్

#

Tags : 1

Videos

APలో ఉన్నది ఎల్ నినో కాదు.. ఎల్లో నినో ఎఫెక్ట్.. YS జగన్ కౌంటర్

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై విచారణ.. రంగంలోకి రెవెన్యూ అధికారులు

‘దేశ సేవకు మరింత శక్తి కలగాలి’.. ప్రధాని మోదీకి జగన్‌ విషెస్‌

రోహిత్ & వంశీ మధ్య బిగ్ ఫైట్ కెప్టెన్‌గా చరణ్..!

కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి ఎలా వస్తున్నాయి..? డబ్బులు లేవని చెప్పడానికి సిగ్గులేదా..!

మధుకర్ మహా మాయగాడు నందు కేసులో కొత్త ట్విస్ట్..!

పోరాటం ఫలించింది.. సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్‌

సాయికృష్ణ కేసులో మరో నిందితుడు సరెండర్

PM Modi: బెంగాల్ మహిళలకు గుడ్ న్యూస్

మల్లారెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేతల తిరుగుబాటు? ఫ్లెక్సీలు చించివేత

Photos

+5

పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)

+5

సందడిగా సమంత సీమంతం వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)