Breaking News

అంబానీ కంపెనీతో ఏడీఏఐ డీల్.. వేలకోట్లు పెట్టుబడికి సిద్ధం!

Published on Sat, 10/07/2023 - 15:00

అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ADIA).. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో 0.59 శాతం వాటా కోసం రూ. 4,966.80 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఇది దేశంలోని ఈక్విటీ విలువ ప్రకారం మొదటి నాలుగు కంపెనీలలో ఒకటిగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద ఉన్న 'రిలయన్స్ రిటైల్' సంస్థ ఇషా అంబానీ ఆధ్వర్యంలో ముందుకు సాగుతోంది. ఈమె గత కొన్ని సంవత్సరాలుగా తన వ్యాపారాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్లడం మీద దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే రిలయన్స్ రిటైల్ దాని అనుబంధ సంస్థలు, అసోసియేట్స్ ద్వారా వేగంగా డెవలప్ అవుతోంది.

కొన్ని నివేదికల ప్రకారం.. రిలయన్స్ రిటైల్ కంపెనీ కింద ఏకంగా 18,500 కంటే ఎక్కువ స్టోర్స్ ఉన్నట్లు.. దీని ద్వారా సుమారు 26.7 కోట్ల మంది వినియోగదారులకు సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో భాగస్వామి అయిన అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ADIA)కి ఎల్లప్పుడూ మా మద్దతు ఉంటుందని,  ఈ పెట్టుబడి భారత ఆర్థిక వ్యవస్థ, మా వ్యాపార ప్రాథమిక అంశాలు, వ్యూహం, అమలు సామర్థ్యాలపై మీద ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఇషా అంబానీ అన్నారు. రానున్న రోజుల్లో రిటైల్ రంగంలో మార్పులు వేగవంతంగా పెరిగే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఉద్యోగం పోయి చాలా రోజులైంది.. అప్పటి నుంచి.. మెటా మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్!

ఇక ఏడీఐఏ ప్రైవేట్ ఈక్విటీ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హమద్ షాహ్వాన్ అల్ధహేరి మాట్లాడుతూ.. రోజు రోజుకి వేగంగా అభివృద్ధి చెందుతున్న రిలయన్స్ రిటైల్స్‌లో పెట్టుబడి పెట్టడం ఆనందంగా ఉందని, ఈ పెట్టుబడి సంస్థలో ప్రత్యేక మార్పును తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ డీల్ కోసం మోర్గాన్ స్టాన్లీ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించనున్నట్లు సమాచారం.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)