అదానీ గ్రూప్‌ సంస్థల్లో మరో కీలక పరిణామం!

Published on Mon, 07/10/2023 - 08:34

న్యూఢిల్లీ: Gautam Adani Raised rs 11,330 crore : ప్రణాళికలకు అనుగుణంగానే నిధుల సమీకరణ చేపట్టినట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ తాజాగా పేర్కొంది. దీంతో గత నాలుగేళ్లలో రూ. 73,800 కోట్లు(9 బిలియన్‌ డాలర్లు) సమకూర్చుకున్నట్లు తెలియజేసింది. ఇందుకు గ్రూప్‌ కంపెనీలలో వాటాల విక్రయాన్ని చేపట్టినట్లు తెలియజేసింది. ఈ బాటలో ఇటీవలే మూడు కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా రూ. 11,330 కోట్లు(1.38 బిలియన్‌ డాలర్లు) సమీకరించిన అంశాన్ని ప్రస్తావించింది.

10ఏళ్ల కాలానికిగాను పెట్టుబడుల పరివర్తన నిర్వహణ (ట్రాన్స్‌ఫార్మేటివ్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌) ప్రణాళికల్లో భాగంగా నిధుల సమీకరణ చేపడుతున్నట్లు అదానీ గ్రూప్‌ వెల్లడించింది. వివిధ పోర్ట్‌ఫోలియో కంపెనీల కోసం 2016లో ఈ ప్రణాళికలకు తెరతీసినట్లు తెలియజేసింది.

దీనిలో భాగంగానే ఇటీవల అదానీ ఎంటర్‌ప్రైజెస్, గ్రీన్‌ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్‌ కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా రూ. 11,330 కోట్లు అందుకున్నట్లు వివరించింది. దీంతో గ్రూప్‌ స్థాయిలో అత్యధిక పెట్టుబడులు అందుబాటులోకి వచ్చినట్లు తెలియజేసింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)