Breaking News

‘అదానీ పవర్‌’ తగ్గింది!

Published on Thu, 05/01/2025 - 19:38

ప్రయివేట్‌ రంగ దిగ్గజం అదానీ పవర్‌ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 5 శాతం నీరసించి రూ. 2,599 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,737 కోట్లు ఆర్జించింది. రూ. 350 కోట్లమేర ఇబిటాపై వన్‌టైమ్‌ ఐటమ్‌ ప్రభావం పడినట్లు కంపెనీ పేర్కొంది.

మొత్తం ఆదాయం మాత్రం 5 శాతం వృద్ధితో రూ. 13,787 కోట్ల నుంచి రూ. 14,522 కోట్లకు బలపడింది. విద్యుత్‌ విక్రయాలు 26.4 బిలియన్‌ యూనిట్ల(బీయూ)కు చేరాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం భారీగా క్షీణించి రూ. 12,750 కోట్లకు చేరింది. 2023–24లో కేవలం రూ. 20,829 కోట్ల లాభం ఆర్జించింది.

ఇందుకు ప్రధానంగా వన్‌టైమ్‌ ఐటమ్, అధిక పన్ను వ్యయాలు కారణమైనట్లు కంపెనీ తెలియజేసింది. మొత్తం ఆదాయం 11 శాతం పుంజుకుని రూ. 56,473 కోట్లకు చేరింది. ఈ కాలంలో 102.2 బీయూ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా.. విక్రయాలు 21 శాతం ఎగసి 95.9 బీయూను తాకాయి. ఫలితాల నేపథ్యంలో అదానీ పవర్‌ షేరు బీఎస్‌ఈలో 3% క్షీణించి రూ. 532 వద్ద ముగిసింది.  

నష్టాల బాటలో జేఎస్‌పీఎల్‌
ప్రయివేట్‌ రంగ దిగ్గజం జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌(జేఎస్‌పీఎల్‌) గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ని రుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 304 కోట్ల నష్టం నమోదు చేసింది.

అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కా లంలో రూ. 933 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరు కి రూ. 2 డివిడెండ్‌ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 15,749 కోట్ల నుంచి రూ. 15,525 కోట్లకు స్వల్పంగా క్షీణించింది.  ఫలితాల నేపథ్యంలో జేఎస్‌పీఎల్‌ షేరు బీఎస్‌ఈలో యథాతథంగా రూ. 895 వద్ద ముగిసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)