Breaking News

అదానీ షేర్ల పతనం, లక్షల కోట్లు ఢమాల్‌, ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన

Published on Fri, 01/27/2023 - 13:54

సాక్షి, ముంబై: అదానీ గ్రూపుపై తీవ్ర ఆరోపణలు స్టాక్‌మార్కెట్‌ను కుదిపేశాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికను విడుదల నివేదికను విడుదల చేసిన తర్వాత స్టాక్ మార్కెట్‌లో కంపెనీలు 8 శాతం వరకు నష్టపోయిన రెండు రోజుల తర్వాత శుక్రవారం కూడా  అదానీ షేర్లలో మరింత అమ్మకాలు వెల్లు వెత్తాయి. మొత్తం తొమ్మిది లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మళ్లీ ఒత్తిడికి గురయ్యాయి. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్ అవర్స్‌లో గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో దాదాపు రూ. 2 లక్షల కోట్లకుపైగా కోల్పోయింది. దీంతో సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా  కుప్పకూలగా, నిఫ్టీ 333 పాయింట్లు పతనమైంది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. కలకలం రేపుతున్న ఈ వివాదం నేపథ్యంలోని ఈ పతనం ఏ మేరకు కొనసాగుతుందనే ఆందోళన నెలకొంది.

అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 20 శాతం మేర భారీ పతనాన్ని నమోదు చేసింది. మరో ముఖ్యమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 13.5 శాతం క్షీణించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్ మిషన్ 12 శాతానికి పైగా పడిపోయాయి. ఇంకా అంబుజా సిమెంట్‌, ఏసీసీ 6 శాతానికి పైగా పతనమవగా, అదానీ పవర్‌, అదానీ విల్‌మార్‌ షేర్లు 5 శాతం చొప్పున క్షీణించాయి.

హిండెన్‌బర్గ్‌ ప్రతి సవాల్‌
మరోవైపు హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై దావా వేయనున్నట్టు అదానీ ప్రకటించింది.  అవన్నీ తప్పుడు వార్తలు తప్పుడు సమాచారరమని కొట్టి పారేసింది. భారతీయ చట్టాల క్రింద సంబంధిత నిబంధనలను పరిశీలిస్తున్నామని అదానీ లీగల్ గ్రూప్ హెడ్ జతిన్ జలంధ్వాలా ఒక ప్రకటనలో తెలిపారు. అయితే తమ నివేదికకు కట్టుబడి ఉన్నామని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ స్పష్టం చేసింది. తమ వద్ద సుదీర్ఘ పత్రాల జాబితా ఉందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ట్విటర్‌లో తెలిపింది. అటు అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై ఆర్‌బీఐ, సెబీ సమగ్ర దర్యాప్తు చేయాలన్న డిమాండ్  ఊపందుకుంది. స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్, మనీలాండరింగ్‌  చేసిందంటూ గౌతమ్ అదానీ  నేతృత్వంలోని అదానీ గ్రూపుపై  జనవరి 24, మంగళవారం అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్  సంచలన నివేదిక  ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Videos

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)