Breaking News

బ్యాలన్స్‌షీట్‌ పటిష్టంగా ఉంది.. ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్‌ భరోసా

Published on Thu, 02/16/2023 - 07:43

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ బ్యాలన్స్‌షీట్‌ అత్యంత పటిష్టంగా ఉన్నట్లు తాజాగా స్పష్టం చేసింది. గ్రూప్‌లోని వివిధ బిజినెస్‌లను వృద్ధి బాటలో కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ గ్రూప్‌పట్ల ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని పెంపొందించేందుకు చూస్తోంది. ఇటీవల యూఎస్‌ షార్ట్‌సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణల కారణంగా గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీలలో అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే.

దీంతో గత మూడు వారాల్లో గ్రూప్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ)కు 125 బిలియన్‌ డాలర్లమేర కోత పడింది. అయితే గ్రూప్‌ లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్‌–డిసెంబర్‌)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో షేరు తిరిగి బలాన్ని పుంజుకోవడం గమనార్హం! అంతర్గత నియంత్రణలు, నిబంధనల అమలు, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ వంటి అంశాలపై నమ్మకంగా ఉన్నట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా గ్రూప్‌ సీఎఫ్‌వో జుగెషిందర్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఈ బాటలో.. తగినన్ని నగదు నిల్వలు కలిగి ఉన్నట్లు, రుణాల రీఫైనాన్స్‌ సామర్థ్యాలను కలిగి ఉన్నట్లు గ్రూప్‌ విడిగా తెలియజేసింది.

తాత్కాలికమే.. 
అదానీ గ్రూప్‌ బ్యాలన్స్‌షీట్‌ అత్యంత పటిష్టంగా ఉన్నట్లు సింగ్‌ తాజాగా పేర్కొన్నారు. పరిశ్రమలోనే అత్యున్నత అభివృద్ధి సామర్థ్యాలను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. మెరుగైన కార్పొరేట్‌ గవర్నెన్స్, పటిష్ట క్యాష్‌ఫ్లో, హామీగల ఆస్తులున్నట్లు వివరించారు. ప్రస్తుత మార్కెట్‌ ఒకసారి నిలకడను సాధిస్తే తిరిగి తమ క్యాపిటల్‌ మార్కెట్‌ వ్యూహాలను సమీక్షించనున్నట్లు వెల్లడించారు. వాటాదారులకు అత్యుత్తమ రిటర్నులు అందించగల బిజినెస్‌లను కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)