Breaking News

హిండెన్‌బర్గ్ ఆరోపణలు: అదానీ గ్రూప్ రియాక్షన్

Published on Sun, 08/11/2024 - 14:50

అమెరికా ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్ సంస్థ 'హిండెన్‌బర్గ్ రీసెర్చ్' ఇటీవల నాలుగు పదాల ట్వీట్ చేసింది. పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్‌ ఆర్థిక అవకతవకలతో సెబీ చైర్‌పర్సన్‌ మాధబీ పురీ బోచ్‌కు, ఆమె భర్త ధవళ్‌ బోచ్‌కు సంబంధముందని తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపైన అదానీ గ్రూప్, సెబీ చైర్‌పర్సన్‌ ఇద్దరూ స్పదించారు.

హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ తిరస్కరించింది. గతంలో కూడా హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మా హోల్డింగ్ మొత్తం పారదర్శకంగా ఉందని చెబుతూ.. అనేక పబ్లిక్ డాక్యుమెంట్‌లలో సంబంధిత వివరాలు క్రమం తప్పకుండా బహిర్గతం చేస్తూనే ఉన్నామని సంస్థ స్పష్టం చేసింది.

అదానీ గ్రూప్‌కు సంబంధించిన వ్యక్తులను లేదా మా స్థితిని కించపరచడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు చేస్తున్నారని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం పేర్కొన్న వ్యక్తులతో ఎటువంటి వాణిజ్య సంబంధాలు లేవు. మేము పారదర్శకత మరియు అన్ని చట్టపరమైన, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా కట్టుబడి ఉంటామని కంపెనీ వివరించింది.  హిండెన్‌బర్గ్ ఆరోపణలు భారతీయ చట్టాలను పూర్తిగా దిక్కరిస్తున్నాయని అదానీ గ్రూప్‌ ప్రతినిధి అన్నారు.

హిండెన్‌బర్గ్ ఆరోపణలపై సెబీ చీఫ్ కూడా స్పందించారు. 2024 ఆగష్టు 10న హిండెన్‌బర్గ్ నివేదికలో మాపై చేసిన ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. మా జీవితం, ఆర్థిక విషయాలు తెరిచిన పుస్తకం వంటివి. అవసరమైన అన్ని విషయాలను ఇప్పటికే సెబీకి అందించాము. వారు కోరే అన్ని ఆర్థిక పత్రాలను ప్రతి అధికారానికి బహిర్గతం చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)