Breaking News

రూ. 7,374 కోట్ల రుణాలు చెల్లించిన అదానీ గ్రూప్‌

Published on Wed, 03/08/2023 - 07:26

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ తాజాగా 2025 ఏప్రిల్‌లో మెచ్యూరిటీ కానున్న రూ. 7,374 కోట్లమేర రుణాలను తిరిగి చెల్లించింది. తాజా చెల్లింపులతో 4 కంపెనీలలో ప్రమోటర్ల వాటాలను తనఖా నుంచి తిరిగి పొందింది.

వీటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన 3.1 కోట్ల షేర్లు(4% వాటా), అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌కు చెందిన 15.5 కోట్ల షేర్లు(11.8% వాటా)తోపాటు అదానీ ట్రాన్స్‌మిషన్‌కు చెందిన 3.6 కోట్ల షేర్లు(4.5% వాటా), అదానీ గ్రీన్‌ ఎనర్జీకి చెందిన 1.1 కోట్ల షేర్లు(1.2% వాటా) ఉన్నట్లు పేర్కొంది.

ఈ నెలాఖరుకల్లా ఇలాంటి మరిన్ని రుణాలను ముందస్తుగానే చెల్లించనున్నట్లు తెలియజేసింది. తద్వారా గ్రూప్‌ రుణ భారంపై ఇన్వెస్టర్లలో తలెత్తిన ఆందోళనలకు చెక్‌ పెట్టే సన్నాహాలకు తెరతీసింది.  కాగా.. ఫిబ్రవరి మొదట్లో చేపట్టిన చెల్లింపులతో కలిపి మొత్తం 2.016 బిలియన్‌ డాలర్ల రుణ భారాన్ని తగ్గించుకున్నట్టు గ్రూప్‌ వివరించింది.  
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)