అదానీ 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు

Published on Thu, 06/20/2024 - 06:21

న్యూఢిల్లీ: హరిత ఇంధన ఉత్పత్తికి అవసరమయ్యే కీలక భాగాల తయారీ సామర్థ్యాలను పెంచుకోవడంపై, ఇంధన పరివర్తన ప్రాజెక్టులపై వచ్చే దశాబ్ద కాలంలో అదానీ గ్రూప్‌ 100 బిలియన్‌ డాలర్లపైగా ఇన్వెస్ట్‌ చేయనుంది.  సోలార్‌ పార్కులను నిరి్మంచడం నుంచి హరిత హైడ్రోజన్, పవన విద్యుత్‌ టర్బైన్లు మొదలైన వాటికోసం ఎలక్ట్రోలైజర్లను తయారు చేయడం వరకు భారీ ప్లాంట్లను గ్రూప్‌ ఏర్పాటు చేస్తోంది.

 రేటింగ్స్‌ ఏజెన్సీ క్రిసిల్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఈ విషయాలు తెలిపారు. ఇంధన పరివర్తన, డిజిటల్‌ మౌలిక సదుపాయాల కల్పనలో లక్షల కోట్ల (ట్రిలియన్ల) డాలర్లకు వ్యాపార అవకాశా లు ఉన్నాయని, ఇవి భారత్‌ రూపురేఖలను దేశీయంగానూ, అంతర్జాతీయంగాను మార్చేయగలవన్నారు.

 అంతర్జాతీయంగా ఇంధన పరివర్తన మార్కెట్‌ 2023లో 3 ట్రిలియన్‌ డాలర్లుగా ఉండగా ఇది 2030 నాటికి 6 ట్రిలియన్‌ డాలర్లకు చేరగలదని, అటుపైన 2050 వరకు ప్రతి పదేళ్లకు రెట్టింపు కానుందని అదానీ చెప్పారు. భారత్‌ నిర్దేశించుకున్నట్లుగా 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలు సాధించాలంటే ఏటా 150 బిలియన్‌ డాలర్ల పైగా పెట్టుబడులు అవసరమన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)