Breaking News

Adani Group crisis: రూ. 10 లక్షల కోట్లు హాంఫట్‌, 24వ స్థానానికి గౌతం అదానీ

Published on Tue, 02/14/2023 - 12:22

సాక్షి, ముంబై: అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌  ప్రకంపనలతో అదానీ గ్రూపు ఇన్వెస్టర్లసంపద రోజురోజుకు ఆవిరైపోతూ వస్తోంది. జనవరి నుంచి అదానీ గ్రూప్ మార్కెట్ విలువలో 10 లక్షల కోట్లు (10 ట్రిలియన్లు రూపాయలకు పైగా పతనమైంది. సోమవారం ఒక్కరోజే  రూ. 51,610 కోట్లను కోల్పోవడం గమనార్హం. సోమవారం ఒక్క రోజు పతనంతో  గ్రూప్ మార్కెట్ విలువ 8.98 ట్రిలియన్‌ రూపాయిలకు పడిపోయింది.

(ఇదీ చదవండి: Valentine's Day 2023:వామ్మో..చాట్‌జీపీటీని అలా కూడా వాడేస్తున్నారట!)

హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలతో  జనవరి 24న ప్రారంభమైన మెల్ట్‌డౌన్, గ్రూప్ మార్కెట్ క్యాప్ నుండి 10.2 ట్రిలియన్ రూపాయలు లేదా 53 శాతం తుడిచి పెట్టుకుపోయింది మరోవైపు అదానీ గ్రూప్ ఛైర్మన్, గౌతం అదానీ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 24వ స్థానానికి దిగజారారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఫిబ్రవరి 14 నాటికి అదానీ నికర విలువ 52.4 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, నికర విలువ  53 బిలియన్‌ డాలర్లుగా  ఉంది.

గ్లోబల్ ఇండెక్స్ ప్రొవైడర్ ఎంఎస్‌సీఐ గత వారం చివరిలో దాని గ్లోబల్ ఇండెక్స్‌లలో భాగమైన కొన్ని గ్రూప్ కంపెనీల వెయిటింగ్‌లను తగ్గించడం, అలాగే గ్రూప్ తన క్యాపెక్స్ ప్లాన్‌లను తగ్గించాలని యోచిస్తున్న తాజా నివేదికల తరువాత తాజా నష్టాలు సంభవించాయి. ఇప్పటికే హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను తిప్పి కొట్టిన అదానీ గ్రూప్ కొన్ని కంపెనీల స్వతంత్ర ఆడిట్‌ల కోసం అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థోర్న్టన్‌ను నియమించినట్టు తెలుస్తోంది. (Valentines Day2023: జియో బంపర్‌ ఆఫర్స్‌) 

అంతా బానే ఉంది: ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్‌ భరోసా 
ఇన్వెస్టర్లకు భరోసా కల్పించేందుకు అదానీ గ్రూప్‌ ప్రయత్నాలు చేస్తోంది. తమ వ్యాపార ప్రణాళికలకు అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. వాటాదారులకు మంచి రాబడులే అందించగలమంటూ ధీమా వ్యక్తం చేసింది. వృద్ధి లక్ష్యాలు, పెట్టుబడులను కుదించుకుంటున్నట్లు వస్తున్న వార్తలను గ్రూప్‌ అధికార ప్రతినిధి ఖండించారు. ప్రస్తుత మార్కెట్‌ కుదుటపడిన తర్వాత గ్రూప్‌లోని ప్రతీ సంస్థ తన వ్యూహాల సమీక్ష చేపడుతుందని చెప్పారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)