Breaking News

బ్యాట్ పట్టుకున్న ఈయనెవరో గుర్తుపట్టారా? కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!

Published on Sun, 08/13/2023 - 11:02

భారతదేశంలో టాప్ 10 ధనవంతుల జాబితాలో రెండవ స్థానం పొందిన 'గౌతమ్ అదానీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుమారు 54.5 బిలియన్ డాలర్ల సంపద కలిగి అదానీ గ్రూప్ ఆఫ్ అధినేత ఈ రోజు ఎలా ఉన్నాడో అందరికి తెలుసు. అయితే యుక్త వయసులో ఎలా ఉండేవాడనేది ఇక్కడ చూడవచ్చు.

నేడు దేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం అంబానీతో పోటీ పడుతున్న ఆదానీ.. సోలార్, థర్మల్ విద్యుత్ తయారీ, ఓడరేవుల నిర్వహణ వంటి ఎన్నెన్నో వ్యాపారాలు చేస్తూ కోట్లకు కోట్లు ఆర్జిస్తున్నారు. గుజరాత్‌లో జన్మించిన ఈయన కాలేజీ చదువుని మధ్యలోనే ఆపేసి డైమండ్ బిజినెస్ చేయడానికి 1980లోనే ముంబై వెళ్ళాడు. ఆ తరువాత కొంతకాలానికి ప్లాస్టిక్ దిగుమతుల వ్యాపారంలో అన్నయ్యకు తోడుగా ఉండటానికి వచేసాడు. ఆ తరువాత 1988లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ స్థాపించాడు.

ఇదీ చదవండి: ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్

చిన్నప్పుడు స్కూల్ ట్రిప్‌లో భాగంగా కాండ్లా ఓడరేవుకి వెళ్లినట్లు, ఆ పోర్టు చూసాక పెద్దయ్యాక ఇలాంటిది నేను కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు అదానీ గతంలో వెల్లడించారు. అనుకున్న విధంగానే ముంద్రా పోర్టు కాంట్రాక్ట్ సొంతం చేసుకుని ప్రస్తుతం బాగా విస్తరించారు.

ఎన్నెన్నో ఒడిదుడుకులు ఓర్చుకుని ఈ రోజు దేశంలోని ధనవంతుల జాబితాలో ఒకరుగా నిలిచారు. ప్రస్తుతం ఈయన నెట్ వర్త్ రూ. 5.9 లక్షల కోట్లు కంటే ఎక్కువ అని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఆదానీ టాప్ 10 జాబితాలో మొదటి స్థానం పొందే అవకాశాలు కూడా ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)