Breaking News

డిజిటల్‌ ఎకానమీపై అదానీ గ్రూప్‌ దృష్టి

Published on Fri, 12/29/2023 - 07:22

న్యూఢిల్లీ: దాదాపు 175 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్న దేశీ డిజిటల్‌ ఎకానమీలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై అదానీ గ్రూప్‌ దృష్టి పెట్టింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, బ్లాక్‌చెయిన్‌ తదితర ఉత్పత్తులు, సేవలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అబుధాబీకి చెందిన ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ కంపెనీ (ఐహెచ్‌సీ) అనుబంధ సంస్థ సిరియస్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌తో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో (ఏఈఎల్‌) భాగమైన అదానీ గ్లోబల్‌ జట్టు కట్టింది.

 సిరియస్‌ డిజిటెక్‌ ఇంటర్నేషనల్‌ పేరుతో జాయింట్‌ వెంచర్‌ సంస్థను ఏర్పాటు చేసింది. ఇది అబుధాబీ కేంద్రంగా పని చేస్తుంది. సిరియస్‌ జేవీలో సిరియస్‌కు 51%, అదానీ గ్రూప్‌నకు 49% వాటాలు ఉంటాయి. అంతర్జాతీయంగా డిజిటల్‌ పరివర్తన విభాగంలో సిరియస్‌ అనుభవం, దేశీ మార్కెట్‌పై అదానీ గ్రూప్‌ పరిజ్ఞానంతో భారత డిజిటల్‌ ఎకానమీలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై సిరియస్‌ జేవీ దృష్టి పెట్టనుందని ఏఈఎల్‌ తెలిపింది.

ప్రస్తుతం 175 బిలియన్‌ డాలర్లుగా ఉన్న డిజిటల్‌ ఎకానమీ 2030 నాటికి ట్రిలియన్‌ (లక్ష కోట్ల) డాలర్లుగా ఎదగనుందని అంచనాలు ఉన్నట్లు పేర్కొంది. ఇన్‌ఫ్రాతో పాటు ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, గ్రీన్‌టెక్‌ తదితర రంగాల్లోనూ అధునాతన కృత్రిమ మేథ (ఏఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), బ్లాక్‌చెయిన్‌ మొదలైన వాటిని మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు సిరియస్‌ జేవీ కృషి చేస్తుందని తెలిపింది.
 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)