Breaking News

అదానీ-హిండెన్‌బర్గ్: అదానీకి మరోషాక్‌! ఆ ప్రమాదం ఎక్కువే?

Published on Mon, 02/06/2023 - 12:07

సాక్షి, ముంబై: అదానీ గ్రూప్‌పై షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇటీవల చేసిన ఆరోపణలు ప్రభావం సంస్థను భారీగానే ప్రభావితం చేస్తోంది.  హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ వచ్చి  12 రోజుల తరువాత కూడా ఆ సెగలు కొనసాగుతున్నాయి. కంపెనీకి చెందిన అన్ని షేర్లు భారీగా కుప్పకూలగా, అదానీ చైర్మన్‌ గౌతం అదానీ నికర సంపద దారుణంగా పడిపోయింది. చివరికి అదానీగ్రూప్‌నకు కీలకమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీవోను కూడా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించి  తాజాగా అదానీకి మరో షాక్‌ తగలనుందనే ఊహాగానాలు మార్కెట్‌లో ఉన్నాయి. రూ. 11,574 కోట్ల  రుణాన్ని రీకాల్‌  చేసే ప్రమాదం ఉందని  వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. 

 అదానీ ఎంటర్‌ప్రైజెస్, దాని అనుబంధ కంపెనీలు తీసుకున్న మొత్తం రూ. 11,574 కోట్ల  అన్‌సెక్యూర్డ్‌ లోన్స్‌ రుణాలను  ఇపుడు  బ్యాంకులు ,ఆర్థిక సంస్థలు రీకాల్ చేసే  అవకాశం ఉందని  అంచనా. రూ.20 వేల కోట్ల ఫాలో-ఆన్-పబ్లిక్ ఆఫర్ ను ఆకస్మికంగా ఉపసంహరించుకోవాలని గ్రూప్ ఇటీవల తీసుకున్న నిర్ణయం, ప్రత్యేకించి అదనపు వనరులను సమీకరించడంలో కొత్త సవాళ్లను సృష్టించింది. ముఖ్యంగా కంపెనీ పెట్టుబడి దారులకు వెల్లడించిన వివరాల ప్రకారం, "ఈ రుణాలు ఏదైనా అంగీకరించిన రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం తిరిగి చెల్లించలేకపోవచ్చు, రుణదాత ఎప్పుడైనా రీకాల్ చేసే అవకాశం ఉందని వెల్లడించింది. అదే జరిగితే  తమ అనుబంధ సంస్థలు ఫైనాన్సింగ్‌ కోసం ప్రత్యామ్నాయ వనరులను కనుగొనవలసి ఉంటుందని, అయితే బలమైన నగదు ప్రవాహం, సురక్షితమైన ఆస్తులతో గ్రూప్ బ్యాలెన్స్ షీట్ చాలా ఆరోగ్యంగా ఉందని గౌతం అదానీ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి తాజా అంచనాలపై అదానీ మేనేజ్‌మెంట్‌ ఎలా స్పందిస్తుందో  చూడాలి.

అట్టుడుకిన పార్లమెంట్‌
మరోవైపు అదానీపై అవినీతి ఆరోపణలతో  హిండెన్‌బర్గ్ నివేదికసౌ విపక్షాలు సోమవారం పార్లమెంటులో లేవనెత్తాయి, చర్చకు డిమాండ్ చేయడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. కాగా హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌  తరువాత అంబుజా, ఏసీసీ సిమెంట్‌తో సహా తొమ్మిది అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏడు ట్రేడింగ్ రోజుల వ్యవధిలో దాదాపు సగం (100 బిలియన్ డాలర్ల వరకు) క్షీణించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఒక్కటే భారీ మార్కెట్ క్యాప్ విలువను కోల్పోయింది. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)