Breaking News

కిచ్చా సుదీప్ కొత్త కారు.. ధర ఎంతంటే?

Published on Tue, 07/21/2026 - 16:44

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. సెలబ్రిటీలు కూడా ఈ వాహనాలను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే.. నటుడు కిచ్చా సుదీప్ ఇటీవల ఒక 'బీఈ6' కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో.. డీలర్‌షిప్‌కు సుదీప్ రావడం, కారు డెలివరీ తీసుకోవడం వంటివి చూడవచ్చు. ఈయన డెసర్ట్ మిస్ట్ కలర్ మహీంద్రా బీఈ6 కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఫైర్‌స్టార్మ్ ఆరెంజ్, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్, డీప్ ఫారెస్ట్ రంగులలో కూడా లభిస్తుంది.

మహీంద్రా బీఈ6 గురించి
మహీంద్రా బీఈ6 ప్యాక్ త్రీ వేరియంట్‌లో 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, కీలెస్‌ ఎంట్రీ అండ్ గో, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, అడాప్టివ్ సస్పెన్షన్, C-ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్స్, లైట్ యానిమేషన్‌తో కూడిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, 360 డిగ్రీ కెమెరా, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్ అప్ డిస్‌ప్లే, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో లేన్ సెంటరింగ్, ఆటోమేటిక్ లేన్ చేంజ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఎమర్జెన్సీ స్టీరింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లతో కూడిన లెవెల్ 2 ఏడీఏఎస్ కూడా ఉన్నాయి.

బీఈ6 రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో లభిస్తుంది. అవి 59 కిలోవాట్, 79 కిలోవాట్. టాప్ వేరియంట్‌లో లభించే పెద్ద బ్యాటరీ 682 కిమీ రేంజ్ అందిస్తుంది. చిన్న బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 656 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు ధరలు రూ.18.90 లక్షల నుంచి రూ.28.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)