Breaking News

బంగారం వేలం నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

Published on Tue, 02/11/2025 - 04:51

న్యూఢిల్లీ: బంగారం వేలం విషయంలో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. బంగారం తనఖాపై రుణం తీసుకున్న వారు సకాలంలో చెల్లించకపోతే, బ్యాంక్‌లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) ఆ బంగారాన్ని వేలంలో విక్రయించి రుణ బకాయిలతో సర్దుబాటు చేసుకుంటుంటాయి. ఇందుకు నిర్దేశిత ప్రక్రియలు, నిబంధనలను బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు అనుసరించాల్సి ఉంటుంది. 

ఈ విషయమై లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నకు ఆర్థిక మంత్రి బదులిచ్చారు. ఎన్‌బీఎఫ్‌సీలు, షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంక్‌లకు ఈ విషయంలో నిబంధనలు ఒకే విధంగా ఉన్నట్టు చెప్పారు. రుణ చెల్లింపులు సరిగ్గా లేవంటూ ఖాతాదారులకు బ్యాంక్‌లు తగినన్ని సార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ రుణ గ్రహీత చెల్లింపులకు ముందుకు రాకపోతే అప్పుడు బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీ బంగారం వేలానికి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు.  నిబంధనలను బ్యాంక్‌లు ఉల్లంఘించినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  

బంగారానికి డిమాండ్‌: దేశంలో బంగారానికి డిమాండ్‌ తగ్గలేదని, పెరుగుతూ వెళుతోందని కాంగ్రెస్‌ సభ్యుడు మనీష్‌ తివారీ ప్రశ్నకు సమాధానంగా మంత్రి సీతారామన్‌ బదులిచ్చారు. ‘‘దేశంలో వ్యక్తులు, చిన్న వర్తకులు సురక్షితమైన, లిక్విడ్‌ సాధనమన్న ఉద్దేశ్యంతో బంగారంలో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు’’అని వివరించారు.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)