Breaking News

ఏసీ అమ్మకాల్లో  వృద్ధి అంతంతే..!

Published on Thu, 06/19/2025 - 06:35

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది రూమ్‌ ఏసీల విక్రయాలు 10–15 శాతమే పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా అధిక డిమాండ్‌ ఉండే జూన్‌లో ఉత్తర, పశ్చిమ భారత్‌లో వేడి వాతావరణం నెలకొనగా, మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో కంపెనీలు తమ అంచనాలను తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఏసీల అమ్మకాలకు వేసవి సీజన్‌ ఎంతో కీలకం.

 అధిక శాతం అమ్మకాలు ఈ సీజన్‌లోనే నమోదవుతుంటాయి. కానీ ఈ ఏడాది వేసవిలో మధ్యంతర వర్షాలు ఈ రంగం ఆశలపై నీళ్లు చల్లింది. జూన్‌లో ఉత్తరాది అంతటా వేడి వాతావరణం నెలకొనడం ఒక్కటి విక్రయాలకు కాస్తంత మద్దతునిచ్చే అంశం. నిజానికి ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఫిబ్రవరి, మార్చిలోనే రూమ్‌ ఏసీల అమ్మకాలకు అధికంగా నమోదు కావడం గమనార్హం. దీంతో గతేడాది సీజన్‌తో పోలి్చతే ఈ ఏడాది 25 శాతం అధిక అమ్మకాలపై కంపెనీలు అంచనాలు వేసుకున్నాయి. 

తర్వాత మారిన వాతావరణ పరిస్థితులతో ఈ అంచనాలు నిజం కాలేదు. ‘‘25–30 శాతం మేర అమ్మకాల వృద్ధిని ఆశించాం. కానీ, అనుకున్న స్థాయిలో అమ్మకాలు సాధించలేదు. ఈ వేసవి నిరాశపరిచిందనడంలో సందేహం లేదు. కానీ, వ్యాపారంలో ఇదొక భాగమే. ఈ పరిస్థితులను అధిగమించి ముందుకు వెళ్లాల్సిందే’’అని బ్లూస్టార్‌ ఎండీ బి.త్యాగరాజన్‌ తెలిపారు. మొత్తానికి ఈ ఏడాది ఆర్‌ఏసీ విక్రయాలు 10–15% వృద్ధికి పరిమితం కావొచ్చని చెప్పారు. జూన్‌ మధ్య నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయంటూ భారత వాతావరణ శాఖ గత వారం అంచనాలు వెల్లడించడం గమనార్హం.  

సెపె్టంబర్‌ క్వార్టర్‌లో పుంజుకోవచ్చు.. 
ప్రస్తుత జూన్‌ త్రైమాసికం రూమ్‌ ఏసీ రంగానికి అనుకూలంగా లేదని.. సెపె్టంబర్‌ త్రైమాసికంలో విక్రయాలు పుంజుకోవచ్చని త్యాగరాజన్‌ పేర్కొన్నారు. పండుగల సందర్భంగా డిమాండ్‌ పెరగొచ్చన్నారు. ఎనర్జీ లేబుళ్లు మారుతుండడం, డిస్కౌంట్‌ ఆఫర్లతో గత నిల్వలను తగ్గించుకోగలమన్నారు. ఇంధన ఆదా లేబుళ్లను మార్చే ముందు ముందస్తు కొనుగోళ్లు పెరగడం సహజమేనన్నారు. 

2024 అమ్మకాలతో పోల్చి చూసినప్పుడు గత రెండు నెలల్లో ఎలాంటి వృద్ధి కనిపించలేదని వోల్టాస్‌ ఎండీ, సీఈవో ప్రదీప్‌ బక్షి సైతం తెలిపారు. కనుక జూన్‌ త్రైమాసికంలో అమ్మకాల పరంగా పెద్ద వృద్ధి నమోదు కాకపోవచ్చని, గతేడాది మాదిరిగా 25 శాతం వృద్ధిని సాధించడం సవాలుగా పేర్కొన్నారు. వేసవిలో అమ్మకాలు గరిష్టంగా ఉండే సమయంలో వర్షాలు దెబ్బతీసినట్టు చెప్పారు. ఏప్రిల్, మే నెలలో అమ్మకాల వృద్ధిని కోల్పోవడంతో, మిగిలిన ఏడాదిలో కోలుకోవడం కష్టమని అభిప్రాయపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి ఉత్తరాదిలో వేడి వాతావరణంతో ఏసీల అమ్మకాలు పుంజుకున్నాయంటూ, ఇదొక్కటే సానుకూలతగా పేర్కొన్నారు.  

జూన్‌లో కాస్త మెరుగు.. 
హైయర్‌ అప్లయన్సెస్‌ ఇండియా మాత్రం ఈ ఏడాది ఇప్పటి వరకు మెరుగైన వృద్ధిని సొంతం చేసుకుంది. గతేడాదితో పోలి్చతే రూమ్‌ ఏసీల అమ్మకాలు 30 శాతం పెరిగినట్టు సంస్థ ప్రెసిడెంట్‌ ఎన్‌ఎస్‌ సతీష్‌ వెల్లడించారు. ‘‘ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలకు సానుకూలంగా లేవు. 10–15 శాతం మేర అమ్మకాలు తగ్గాయి. జూన్‌లో తిరిగి అమ్మకాలు పుంజుకున్నాయి.

 ఫిబ్రవరి, మార్చిలోనే ప్రణాళిక మేరకు ముందస్తు కొనుగోళ్లు జరిగాయి’’అని వివరించారు. కానీ, ఏప్రిల్, మే నెలల్లో కొనుగోలు చేద్దామనుకున్న కస్టమర్లు.. ఉష్ణోగ్రతలు పెరగకపోవడంతో వాయిదా వేసుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా జూన్‌లో గత పది రోజులుగా ఉత్తరాది ప్రాంతంలో అమ్మకాలు పెరిగినట్టు తెలిపారు. 2025 సంవత్సరంలో మిగిలిన కాలానికి పరిశ్రమ అంచనాలు తగ్గించుకున్నట్టు సతీష్‌ తెలిపారు. గతేడాది స్థాయిలో వృద్ధి ఉండకపోవచ్చంటూ.. అమ్మకాలు 10–15 శాతం వృద్ధికి పరిమితం కావొచ్చన్నారు.   
 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)