Breaking News

ఏసీలు, డిష్‌వాషర్ల  ధరలు తగ్గుతున్నాయ్‌.. 

Published on Sun, 09/21/2025 - 06:14

న్యూఢిల్లీ: గృహోపకరణాల దిగ్గజ సంస్థలు జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్‌ కండీషనర్ల (ఏసీలు) రేట్లను రూ.4,500 వరకు, డిష్‌వాషర్ల ధరలను రూ.8,000 వరకు తగ్గించాయి. కొత్త ధరలు సెప్టెంబర్‌ 22(సోమవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. ఏసీల తయారీ కంపెనీలు రూమ్‌ ఎయిర్‌ కండీషనర్లతో పాటు వాణిజ్య సముదాయాల్లో వినియోగించే వీఆర్‌ఎఫ్‌ ఏసీలు, స్ల్పిట్‌ ఏసీలు, టవర్‌ ఏసీలపై కూడా ధరలు తగ్గించాయి. 

వోల్టాస్, డైకిన్, గోద్రెజ్‌ అప్లయెన్సెస్, పానసోనిక్, హైయర్‌ తదితర ప్రముఖ బ్రాండ్లు తగ్గింపు ధరలతోనే ముందస్తు బుకింగ్‌లు ప్రారంభించాయి.  ప్రతిపాదిత జీఎస్‌టీ రేట్ల కోతతో పండుగ సీజన్‌ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదవుతుందని కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్‌టీ సంస్కరణల్లో కేంద్రం ఏసీలు, డిష్‌వాషర్లపై జీఎస్‌టీ 28% నుంచి 18 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.  

→ గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ లైట్‌ కమర్షియల్, టవర్‌ ఏసీల ధరలను రూ.8,550 నుంచి రూ.12,450 వరకు తగ్గిస్తోంది. స్ల్పిట్‌ ఏసీ ఇన్వర్టర్‌ మోడళ్ల ధరలు రూ.3,200 – 5,900 మేర తగ్గుతాయి. 

→ హైయర్‌ కంపెనీ తన గ్రావిటీ (1.6 టన్నుల ఇన్వర్టర్‌)ఏసీలపై రూ.3,905, అలాగే కినౌచీ ఏసీ మోడల్‌ (1.5 టన్నులు, 4 స్టార్‌ రేటింగ్‌)పై రూ.3,202 తగ్గిస్తోంది.   
→ వొల్టాస్‌ కంపెనీ ఫిక్స్‌డ్‌ స్పీడ్‌ విండో ఏసీ ధరలు రూ.42,990 నుంచి రూ.39,590కి, ఇన్వర్టర్‌ ఇండో ఏసీ ధరలు రూ.46,990 నుంచి రూ.43,290కి తగ్గించింది.  

→ జపాన్‌ చెందిన డైకిన్‌ సంస్థ 5 స్టార్‌ ఇన్వర్టర్‌ స్ల్పిట్‌ ఏసీ ధర (1 టన్ను) రూ.20,500 నుంచి రూ.18,890కు, అలాగే 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన ఇన్వర్టర్‌ స్ల్పిట్‌ ఏసీ ధర రూ.73,800 నుంచి రూ.68,020కు, 1.8 సామర్థ్యం కలిగిన ఇన్వర్టర్‌ స్ల్పిట్‌ ఏసీ ధర రూ.92,200 నుంచి రూ.84,980కు దిగివచ్చాయి. ఇదే కంపెనీ 3 స్టార్‌ రేటింగ్‌ కలిగిన ఇన్వర్టర్‌ స్ల్పిట్‌ ఏసీ(1 టన్ను సామర్థ్యం) ధరలను రూ.50,700 నుంచి రూ. 46,730కు, 1.5 సామర్థ్యం కలిగిన హాట్‌అండ్‌కోల్డ్‌ ఇన్వర్టర్‌ స్ల్పిట్‌ ఏసీ ధర రూ.61,300 నుంచి రూ.56,500 కు తగ్గించింది. 

→ ఎల్‌జీ ఎల్రక్టానిక్‌ ఎంట్రీ లెవల్‌ 3 స్టార్‌ ఇన్వర్టర్‌ స్ల్పిట్‌ ఏసీ(టన్ను సామర్థ్యం) ధరలపై రూ.2,800 తగ్గించింది. 1.5 టన్ను సామర్థ్యం కలిగిన ఇన్వర్టర్‌ స్ల్పిట్‌ ఏసీ ధరలపై రూ.3,600, రెండు టన్నుల సామర్థ్యం కలిగిన  స్ల్పిట్‌ ఏసీలపై రూ.4,400 ధరను తగ్గించింది. 

→ పానసోనిక్‌ ఇండియా 1.5 టన్ను విండో ఏసీ ధరల శ్రేణి 45,650 – 49,990 నుంచి రూ.42,000 – 46,000కి దిగిరానుంది. అలాగే ఫిక్స్‌డ్‌ స్పీడ్‌ స్ల్పిట్‌ ఏసీ(టన్ను సామర్థ్యం)లపై రూ.3700, రెండు టన్నుల సామర్థ్యం కలిగిన ఏసీలపై రూ.5,500 వరకు తగ్గించింది.  

డిష్‌ వాషర్ల ధరలు ఇలా 
బీఎస్‌హెచ్‌ హోమ్‌ అప్లయెన్సెస్‌ రూ.8,000 వరకు తగ్గించింది. సెప్టెంబర్‌ 22 నుంచి ఎంట్రీ లెవల్‌ డిష్‌వాషర్‌ రూ.49,000 నుంచి రూ.45,000కు, టాప్‌–ఎండ్‌ మోడల్‌ రూ.104,500 నుంచి రూ.96,500కు దిగిరానుంది. అలాగే వొల్టాస్‌ బెకో ఎంట్రీలెవల్‌ డిష్‌వాషర్ల ధరలు రూ.25,990 నుంచి రూ.23,390కు తగ్గనున్నాయి.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)