5 సంవత్సరాలు.. రూ.100 కోట్లు - గ్రోమో అరుదైన రికార్డ్

Published on Thu, 02/08/2024 - 15:10

ఫైనాన్షియల్ ఉత్పత్తుల పంపిణీని సులభతరం చేసే ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ గ్రోమో.. 5 సంవత్సరాల మైలురాయిని పూర్తి చేస్తున్న సందర్భంగా భారతదేశంలోని తన విలువైన భాగస్వాములకు రూ.100 కోట్ల చెల్లింపులను చేసినట్టు ప్రకటించింది. తెలంగాణలో, కంపెనీ తన 14800 గ్రోమో భాగస్వాములకు రూ.3.75 కోట్లకు పైగా చెల్లింపులను చేసింది.

గత ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణలో 1.03 లక్షల మంది భాగస్వాములు గ్రోమోలో చేరారు, వారు ఎంచుకున్న ఉత్పత్తులను గురించి తెలుసుకోవడానికి రాష్ట్రంలోని 1.5 లక్షల మంది కస్టమర్‌లతో కనెక్ట్ అయ్యారు. గత 5 సంవత్సరాలలో క్రెడిట్ కార్డ్‌ల కోసం 43 శాతం, సేవింగ్స్ ఖాతా కోసం 39 శాతం, పర్సనల్ లోన్ కోసం 13 శాతంతో డిమాండ్ పరంగా తెలంగాణాలో ఎక్కువ ఎక్కువగా ఉంది.

ఐదు సంవత్సరాల మైలురాయిని పూర్తి చేస్తున్న సందర్భంగా గ్రోమో సహ వ్యవస్థాపకుడు 'దర్పన్ ఖురానా' మాట్లాడుతూ.. భారతదేశం అంతటా మా భాగస్వాములకు రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించేలా చేయడం పట్ల మేము చాలా గర్వపడుతున్నామని, గతేడాది తెలంగాణలోని కీలక రంగాలలో 4 రెట్లు వృద్ధిని గమనించినట్లు, దీంతో 14800 మంది సంపాదన భాగస్వాములను చేరుకున్నామని తెలిపారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా, తెలంగాణ అంతటా విజయవంతంగా మా పరిధిని విస్తరించాము. మా విస్తరణ వ్యూహంలో తెలంగాణలో కీలక అంశంగా.. రాబోయే సంవత్సరంలో మా వర్క్‌ఫోర్స్‌ను పెంచాలని, మొత్తం వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరిచే వినూత్న ఉత్పత్తులను పరిచయం చేయాలని ఆశిస్తున్నట్లు గ్రోమో  సీఈఓ  & సహ వ్యవస్థాపకుడు 'అంకిత్ ఖండేల్వాల్' తెలిపారు.

గ్రోమోతో అనుబంధం కలిగి ఉండటం ద్వారా  దేశంలోని ప్రతి మూలకు మేము సౌకర్యవంతంగా చేరుకోగలుగుతున్నామని ఈ సందర్భంగా 'పునీత్ భాటియా' (హెడ్-ఏజెన్సీ, SBI జనరల్ ఇన్సూరెన్స్) అన్నారు.

Videos

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

DSCపై లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధం.. అభ్యర్థి సంచలన సవాల్..!

వైఎస్ జగన్ పాదయాత్ర.. తేదీ ఖరారు..!

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

Photos

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)