Breaking News

అభిషేక్‌ బచ్చన్‌కు ఎస్‌బీఐ నుంచి భారీ ఆదాయం

Published on Mon, 01/27/2025 - 14:04

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు, నిర్మాతగా ప్రసిద్ధి చెందారు. గురు, ధూమ్, దోస్తానా, హ్యాపీ న్యూ ఇయర్, బంటీ ఔర్ బబ్లీ వంటి చిత్రాలలో తన నటనతో గుర్తింపు పొందారు. అభిషేక్ నటనతో పాటు వ్యాపార రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్రీడలలోనూ చురుకుగా పాల్గొనే ఆయనకు వివిధ క్రీడా జట్లలో వాటాలు ఉన్నాయి.

ఎస్‌బీఐ నుంచి నెలకు రూ.18లక్షలు
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) అభిషేక్ బచ్చన్‌కు ప్రతి నెలా రూ. 18 లక్షలు చెల్లిస్తుందని మీకు తెలుసా? అభిషేక్ బచ్చన్, విశ్వ సుందరి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఆరాధ్య బచ్చన్ అనే ఒక కుమార్తె ఉంది.

రూ.280 కోట్ల నెట్‌వర్త్‌ ఉన్న అభిషేక్ బచ్చన్ తమ విలాసవంతమైన జుహు బంగ్లా, అమ్ము, వాట్స్ భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లాభదాయకమైన లీజు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎస్‌బీఐ ఈ స్థలాన్ని 15 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. ఇది బచ్చన్ కుటుంబానికి గణనీయమైన అద్దె ఆదాయాన్ని అందిస్తుంది.

రియల్‌ ఎస్టేట్‌ ఒ‍ప్పందాలను బయటపెట్టే జాప్‌కీ (Zapkey.com) అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. బచ్చన్ కుటుంబం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య 15 సంవత్సరాల లీజు ఒప్పందం  కుదిరింది. అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం బ్యాంకు నుంచి నెలవారీ అద్దె రూ.18.9 లక్షలు తీసుకుంటున్నారు. ఈ అద్దె కాలానుగుణంగా పెరుగుదలకు సంబంధించిన క్లాజులు కూడా లీజులో పత్రాల్లో ఉన్నాయి. అద్దె ఐదేళ్ల తర్వాత రూ. 23.6 లక్షలకు,  పదేళ్ల తర్వాత రూ. 29.5 లక్షలకు పెరుగుతుంది. నివేదికల ప్రకారం.. బచ్చన్ కుటుంబ నివాసమైన ‘జల్సా’కు సమీపంలో ఉన్న భవనంలో 3,150 చదరపు అడుగుల స్థలాన్నే ఎస్‌బీఐ లీజుకు తీసుకుంది.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)