Breaking News

ఇకపై వాటికి ఆధార్ తప్పనిసరి.. పుట్టిన బిడ్డకు ఎంతో మేలు!

Published on Sun, 07/30/2023 - 08:46

ఇప్పటివరకు 'ఆధార్' (Aadhaar) కార్డు డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకింగ్ రంగం వంటి వాటిలో తప్పనిసరిగా ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు జనన, మరణాల రిజిస్ట్రేషన్ల కోసం కూడా ఆధార్ తప్పనిసరి అంటూ కేంద్రం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. కేంద్ర హోమ్ మినిష్టర్ శాఖ (MHA) రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమీషనర్ కార్యాలయాన్ని జనన, మరణాల రిజిస్ట్రేషన్ల కోసం ఆధార్ ప్రామాణీకరణ చేయడానికి అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఇలాంటి రిజిస్ట్రేషన్స్ కోసం ఆధార్ అవసరం లేదు, కానీ కొత్త ఆదేశాలమేరకు ఇకపై వీటికి కూడా ఆధార్ తప్పనిసరి.

ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు - కారణం తెలిస్తే అవాక్కవుతారు!

1969 చట్టాన్ని సవరించి ఇప్పుడు జనన మరణాల నమోదు చేసేవారు తప్పనిసరిగా ఆధార్ నిర్దారణని అందించాలి. అంతే కాకుండా ఈ డేటాను ప్రతి సంవత్సరం రాష్ట్రాలన్నీ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు నివేదించాల్సి ఉంటుంది. సుమారు 54 సంవత్సరాల తరువాత 1969 చట్టం మొదటిసారి సవరించినట్లు తెలుస్తోంది.

ఆధార్ ఇవ్వడం ద్వారా జనాభా రిజిస్ట్రేషన్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన స్కీమ్స్ సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం సవరణకు లోనైన జనన మరణాల చట్టం 2023లో లేదా ఆ తర్వాత పుట్టిన బిడ్డకు చాలా ప్రయోజనం చేకూర్చుతుందని భావిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)