Breaking News

జనవరి నుంచి ఉద్యోగుల జీతాలు భారీగా పెంపు..?

Published on Mon, 05/26/2025 - 14:56

ఎనిమిదో కేంద్ర వేతన సంఘం (సీపీసీ) అమల్లోకి రావడంతో కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల లబ్ధి చేకూరుతుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. అధికారికంగా 8వ సీపీసీ 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తున్నప్పటికీ, కమిషన్ ఏర్పాటులో పాలనాపరమైన జాప్యం వల్ల 2027 ప్రారంభం వరకు వాయిదా పడే అవకాశం ఉందనే వాదనలు కూడా ఉన్నాయి.

ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను ఇంకా నోటిఫై చేయలేదు. అది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.

ఇదీ చదవండి: గొడుగుల తయారీలో ఆత్మనిర్భర్ ‌భారత్‌

కొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది. ఇది 8వ సీపీసీ కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది. 7వ సీపీసీ 2.57 యూనిఫామ్‌ ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌(కొత్త బేసిక్‌పేలో ఇప్పటివరకు ఉన్న బేసిక్‌పేను 2.57తో హెచ్చు వేస్తారు)ను అవలంబించింది. 8వ సీపీపీకి మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ 1.92 మరింత కన్జర్వేటివ్ ఫ్యాక్టగా ఉండే అవకాశం ఉందని సూచించారు.

లెవల్ 1 ఉద్యోగుల వేతనాల్లో మార్పులు ఇలా..(అంచనా)

 ప్రస్తుతం 7వ సీపీసీ8వ సీపీసీ(అంచనా) 
బేసిక్ పేరూ.18,000రూ.34,560
డియర్నెస్ అలవెన్స్ (57%)రూ.10,260రూ.19,699
ఇంటి అద్దె భత్యం (24%)రూ.4,320రూ.2,765
రవాణా భత్యంరూ.1,350రూ.1,350
స్థూల వేతనంరూ.40,930రూ.58,374
ఎన్‌పీఎస్‌ డిడక్షన్రూ.2,880రూ.5,426
సీజీహెచ్‌ఎస్‌ డిడక్షన్‌రూ.196రూ.250
నికర వేతనంరూ.37,854రూ.52,898
పెరిగే అవకాశం ఇలా..-నెలకు రూ.15,044 (+39.74%)

గమనిక: 2026 జనవరి నాటికి డీఏ 57 శాతానికి పెరగనుంది. నగర వర్గీకరణ ఆధారంగా హెచ్ఆర్ఏ, టీఏ గణాంకాలు కొద్దిగా మారుతూ ఉంటాయి.
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)