Breaking News

ఇకపై 83 షాపులు 24 గంటలు ఓపెన్‌!

Published on Tue, 11/21/2023 - 12:39

దిల్లీ ప్రభుత్వం ఆర్థికంగా బలంగా మారడానికి చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా దుకాణాలను 24 గంటలు తెరిచి ఉంచడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కొంత సొమ్ము జమవుతుందని భావిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగరంలో 83 దుకాణాలు, వాణిజ్య సంస్థలకు 24 గంటలు పనిచేయడానికి అనుమతి ఇచ్చారు.  దీంతో దిల్లీలో 24 గంటలపాటు తెరిచి ఉంచే దుకాణాల సంఖ్య 635కు చేరింది.

ఈ మేరకు దిల్లీ ప్రభుత్వ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ కమిటీ (ఎస్‌ఈసీ) నిర్ణయం తీసుకుంది. కమిటీకి మొత్తం 122 దరఖాస్తు వచ్చాయి. కానీ సరైన వివరాలు వెల్లడించని కారణంగా 29 దరఖాస్తులను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. నిర్దిష్ట ప్రదేశాల్లోని దుకాణాలను ఎంపిక చేసి అనుమతించినట్లు చెప్పారు. చట్టంలోని నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. 

దుకాణాలు, వాణిజ్య సంస్థలు 24 గంటలు పనిచేయడంతో నగర ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. దాంతోపాటు మరింత మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా ఈ నిర్ణయం సహకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Videos

ప్రభాస్ బర్త్‌డే స్పెషల్... కల్కీ 2 నుంచి అదిరిపోయే వీడియో

వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ లేఖ

మే. 2029 వరకు మీరు తగ్గకండి నేను తగ్గను... నేను చాగంటి లా ప్రవచనాలు చెప్పే రకం కాదు

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

ధరల పెరుగుదలపై లోకేష్‌కు వరుదు కళ్యాణి సవాల్..!

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

Photos

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)