Breaking News

‘80 కోట్ల భారతీయుల జీవితాలను మార్చిన స్మార్ట్‌ఫోన్‌’

Published on Sat, 08/03/2024 - 09:09

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ 'డెన్నిస్ ఫ్రాన్సిస్' భారతదేశం దాని డిజిటల్ విప్లవాన్ని ప్రశంసించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు విస్తరిస్తున్నాయి. గత ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లోనే కేవలం స్మార్ట్‌ఫోన్‌ల వాడకం వల్ల 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడగలిగారని ఆయన అన్నారు.

గతంలో మాదిరిగా కాకుండా నేడు గ్రామీణ ప్రజలు కూడా బ్యాంకింగ్ సేవల కోసం, వావాదేవీల కోసం స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగిస్తున్నారు. దేశంలో డిజిటలైజేషన్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఫ్రాన్సిస్ ఇండియాను ప్రశంసించారు. ఈ ప్రయోజనాలను పొందటానికి ఇంటర్‌నెట్‌ సౌకర్యాలు కూడా మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందినట్లు ఆయన పేర్కొన్నారు.

పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న డెన్నిస్ ఫ్రాన్సిస్.. ఇండియాను ప్రశంసించారు. భారతదేశం మాదిరిగానే ఇతర గ్లోబల్ సౌత్ దేశాలు కూడా డిజిటలైజేషన్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలనీ ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో భారత్ మొత్తం డిజిటలైజేషన్‌గా మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.

గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం డిజిటలైజేషన్ మీద ఎక్కువ ద్రుష్టి సారించింది. 2016లో రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు తర్వాత.. యూపీఐ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. జన్ ధన్ వంటి వాటికోసం ఆధార్ అథెంటికేషన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో లక్షలాది మంది గ్రామీణ ప్రజలు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. ఆ తరువాత చాలామంది ఆన్‌లైన్ చెల్లింపులు చేయడానికి ఆసక్తి చూపారు. ఈ విధంగా డిజిటలైజేష పురోగతి చెందింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)