Breaking News

నిర్ణయాల ప్రక్రియలో కీలకంగా ఏఐ 

Published on Sun, 08/17/2025 - 04:56

న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) పూర్తిగా ఆటోమేషన్‌ సాధనంగా కన్నా, మెరుగైన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలోనే మరింత కీలకంగా ఉపయోగపడుతుందని పలు దిగ్గజ కంపెనీలు భావిస్తున్నాయి. పబ్లికేషన్‌ సంస్థ సీఐవోఅండ్‌లీడర్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం 2023 నుంచి వివిధ సృజనాత్మక ప్రక్రియల్లో కంటెంట్‌ మార్కెటింగ్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌ వరకు జనరేటివ్‌ ఏఐ వినియోగం అయిదు రెట్లు పెరిగింది. 2025 ఆఖరు నాటికి కంపెనీలు 30 శాతం ఐటీ సరీ్వసులు పూర్తిగా ఏఐతో ఆటోమేట్‌ చేయనున్నాయి. 

వ్యయాలను తగ్గించుకోవడం, ప్రాసెసింగ్, నిర్వహణ సామరŠాధ్యలను పెంచుకోవాలన్న లక్ష్యాలే ఏఐని వినియోగించుకోవడానికి కారణమని 98.4 శాతం కంపెనీలు తెలిపాయి. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు కృత్రిమ మేథ విలువైన సాధనంగా ఉపయోగపడుతుందని 96 శాతం కంపెనీలు వివరించాయి. 2025 మే–జూలై మధ్య నిర్వహించిన సర్వేలో రూ. 5,000 కోట్ల పైగా వార్షిక టర్నోవరు ఉన్న కంపెనీలకు చెందిన 350 మంది చీఫ్‌ ఐటీ (లేదా) చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్లు పాల్గొన్నారు.  

రిపోర్ట్‌లో మరిన్ని విశేషాలు.. 
→ 2025లో 93 శాతం కంపెనీలు ఏఐ, అనలిటిక్స్‌పై పెట్టుబడులను పెంచనున్నాయి. సగం పైగా సంస్థ లు బడ్జెట్లను భారీగా పెంచే ఆలోచనలో ఉన్నాయి. 
→ ఐటీ కార్యకలాపాల్లో ఆటోమేషన్‌ కోసం, లోపాలను గుర్తించడం వంటి పనులకు 41 శాతం కంపెనీలు ఏఐని వినియోగిస్తున్నాయి.  
→ చాట్‌బాట్‌లు, పర్సనలైజేషన్‌ లాంటి అవసరాల కోసం ఫైనాన్స్‌ (31 శాతం), కస్టమర్‌ సర్వీస్‌ (28 శాతం) విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. 
→ 90 శాతం కంపెనీలు డేటా భద్రత, గోప్యతను ఏఐ వినియోగానికి ప్రధాన సవాలుగా ఉంటోంది. డేటా నాణ్యతపరమైన సవాళ్లు ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. 
→ 85 శాతం సంస్థలు ఏఐ సాధనాలను అంతర్గతంగానే తయారు చేసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)