Breaking News

జీఎ‍స్టీ మినహాయింపు వీటిపైనే?

Published on Fri, 12/20/2024 - 15:01

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చిన ఏడు సంవత్సరాల తర్వాత మొదటిసారి పన్ను రేట్లలో భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై తుది నిర్ణయం ఈనెల 21న జరిగే 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వెలువడుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. ఈ సమావేశం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో నిర్వహిస్తున్నారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఈ సమావేశంలో తీసుకుబోయే నిర్ణయాలు కింది విధంగా ఉంటాయని ఊహాగానాలు వస్తున్నాయి.

మినహాయింపులు..

  • జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ రేట్లను తగ్గించే ప్రతిపాదనలున్నాయి.

  • సీనియర్ సిటిజన్లు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు.

  • సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులకు రూ.5 లక్షల వరకు కవర్ చేసే పాలసీలకు ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు.

  • రూ.5 లక్షల కంటే ఎక్కువ కవరేజీ ఉన్న పాలసీల ప్రీమియంలపై 18% జీఎస్టీ కొనసాగిస్తారని అంచనా.

మార్పులు..

  • జీఎస్టీ హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం విలాసవంతమైన వస్తువులు, సిన్‌ గూడ్స్‌ (అత్యంత ఖరీదైన దిగుమతి చేసుకునే వస్తువులు)పై పన్ను పెంచుతారు.

  • చేతి గడియారాల ధర రూ.25,000 ఉంటే జీఎస్టీ 18% నుంచి 28%కి పెంపు.

  • రూ.15,000 కంటే ఎక్కువ ధర ఉన్న షూస్‌పై జీఎస్టీ 18% నుంచి 28%కి పెంపు.

  • రూ.1,500 వరకు ధర ఉన్న రెడీమేడ్ దుస్తులపై 5% జీఎస్టీ.

  • రూ.1,500-రూ.10,000 మధ్య ధర ఉన్న దుస్తులపై 18% జీఎస్టీ.

  • రూ.10,000 కంటే ఎక్కువ ధర ఉన్న రెడీమేడ్‌ దుస్తులపై 28% జీఎస్టీ.

  • కొన్ని పానీయాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 28% జీఎస్టీను కొత్తగా 35% స్లాబ్‌లో​కి తీసుకురాబోతున్నట్లు అంచనా.

ఇదీ చదవండి: వాట్సప్‌లో చాట్‌జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..

పన్ను తగ్గింపు..

  • ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (20 లీటర్లు, అంతకంటే ఎక్కువ)పై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గింపు.

  • రూ.10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లపై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గింపు.

  • నోట్‌బుక్‌లపై 12% నుంచి 5%కి తగ్గింపు.
     

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)