Breaking News

పీఎస్‌యూ బ్యాంకుల్లో వాటా విక్రయం

Published on Fri, 03/15/2024 - 04:55

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం కొంతమేర వాటాలను విక్రయించనుంది. పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా నిబంధన(ఎంపీఎస్‌) అమలులో భాగంగా ఐదు బ్యాంకుల్లో వాటాలను ఆఫర్‌ చేయనుంది. ఈ జాబితాలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(సీబీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌(ఐవోబీ), యుకో బ్యాంక్, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌(పీఎస్‌బీ) ఉన్నట్లు ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్రటరీ వివేక్‌ జోషీ పేర్కొన్నారు.

2023 మార్చి 31కల్లా మొత్తం 12 పీఎస్‌యూ బ్యాంకుల్లో  4 ఎంపీఎస్‌ నిబంధనలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరో 3 ప్రభుత్వ రంగ బ్యాంకులు 25 శాతం ఎంపీఎస్‌ను సాధించినట్లు పేర్కొన్నారు. ఇకపై మిగిలిన 5 బ్యాంకులు సైతం నిబంధనలను అందుకునే కార్యాచరణకు తెరతీయనున్నట్లు తెలియజేశారు.  

ప్రస్తుత తీరిలా: ప్రస్తుతం పీఎస్‌బీలో కేంద్ర ప్రభుత్వం 98.25 శాతం వాటాను కలిగి ఉంది. ఈ బాటలో ప్రభుత్వానికి ఐవోబీలో 96.38 శాతం, యుకో బ్యాంక్‌లో 95.39 శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌లో 93.08 శాతం, బ్యాంక్‌ మహారాష్ట్రలో 86.46 శాతం చొప్పున వాటాలున్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)