Breaking News

రూ.10,000 కోట్లకు 5 ఐపీఓలు రెడీ!

Published on Wed, 06/10/2026 - 19:10

ముంబై: దేశీయ ప్రాథమిక మార్కెట్‌ రానున్న రోజుల్లో ఐపీఓలతో మరింత సందడి చేయనుంది. గ్లోబల్‌ ట్రావెల్‌–టెక్‌ యూనికార్న్‌ ఓయో మాతృసంస్థ ‘ప్రిజమ్‌’, వార్‌బర్గ్‌ పింకస్‌ పెట్టుబడులున్న ‘ట్రూహోమ్‌ ఫైనాన్స్‌’, ‘వీగాలాండ్‌ డెవలపర్స్‌’, ‘అద్వాంతా ఎంటర్‌ప్రైజెస్‌’, ‘మెహతా హైటెక్‌ ఇండస్ట్రీస్‌’ల పబ్లిక్‌ ఇష్యూలకు సెబీ అనుమతి ఇచి్చంది. ఈ ఐదు కంపెనీలు కలిపి సుమారు రూ.10,000 కోట్లు సమీకరించే అవకాశం ఉందని మర్చంట్‌ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. కంపెనీలు దాఖలు చేసిన ముసాయిదా పత్రాలపై సెబీ జూన్‌ 1–5 మధ్య తన పరిశీలన పూర్తిచేసి అనుమతులు జారీ చేసింది. 

ప్రిజమ్‌ (ఓయో) భారీ ఇష్యూ 
గ్లోబల్‌ ట్రావెల్‌–టెక్‌ దిగ్గజం ఓయోను నిర్వహిస్తున్న ‘ప్రిజమ్‌’ సంస్థ ఐపీఓ ద్వారా రూ.6,650 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఈ ఇష్యూతో సంస్థ విలువ 7–8 బిలియన్‌ డాలర్ల మధ్య ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంస్థ 2025 డిసెంబరులో కాని్ఫడెన్షియల్‌ ప్రి–ఫైలింగ్‌ మార్గం ద్వారా సెబీకి ముసాయిదా పత్రాలను సమరి్పంచింది. ఓయో ఆపరేటర్‌ ‘ఒరవెల్‌ స్టేస్‌’ 2025 సెప్టెంబరులో ‘ప్రిజమ్‌’గా పేరు మార్చుకుంది. 

ట్రూహోమ్‌ ఫైనాన్స్‌ ఇష్యూ  @ రూ.3,000  
ట్రూహోమ్‌ ఫైనాన్స్‌ ఐపీఓ పరిమాణం రూ.3,000 కోట్లుగా ఉండనుంది. ఇందులో రూ.1,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీ చేయనుంది. అలాగే  ప్రమోటర్‌ సంస్థ ‘మ్యాంగో క్రెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ రూ.1,500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించనుంది. తాజా షేర్ల జారీ ద్వారా వచ్చే నిధులను మూలధనాన్ని బలోపేతం చేసుకోవడానికి, రుణాల పంపిణీ అవసరాలను తీర్చడానికి, ఆర్‌బీఐ నిర్దేశించిన మూలధన సమృద్ధి ప్రమాణాలను పాటించడానికి వినియోగించనుంది.  

వీగాలాండ్‌ డెవలపర్స్‌ 
వీ–గార్డ్‌ గ్రూప్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ‘వీగాలాండ్‌ డెవలపర్స్‌’ ఐపీఓ ద్వారా రూ.250 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలోనే ఉంటుంది. ఈ నిధులను ప్రస్తుత, రానున్న రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు, అలాగే నివాస సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములను కొనుగోలు చేయడానికి వినియోగించనుంది.  

అద్వాంతా ఎంటర్‌ప్రైజెస్‌ 
అగ్రికల్చరల్‌ సొల్యూషన్స్‌ అందించే ఈ సంస్థ ఐపీఓ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో ఉంటుంది. ప్రమోటర్‌ యూపీఎల్‌ లిమిటెడ్‌తో పాటు ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు మెల్‌వుడ్‌ హోల్డింగ్స్‌– ఐఐ, కేఐఏ ఈబీటీ స్కీమ్‌–2 కలిపి 3.61 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. 

మెహతా హైటెక్‌ ఇండస్ట్రీస్‌
అహ్మదాబాద్‌కు చెందిన ఈ సంస్థ ఐపీఓ ద్వారా గరిష్టంగా 62 లక్షల కొత్త ఈక్విటీ షేర్లను ఐపీఓ ద్వారా జారీ చేయనుంది.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)