Breaking News

Rekha Jhunjhunwala: నాలుగు గంటల్లో రూ.482 కోట్లు..

Published on Tue, 02/21/2023 - 08:27

నాలుగు గంటల్లో రూ.482 కోట్లు ఆర్జించి రికార్డ్‌ సృష్టించారు రేఖా ఝున్‌ఝున్‌వాలా. ఆమె దివంగత ఇన్వెస్టర్‌ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి. దేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు. ఆమె భర్త కూడా ప్రీ-ఐపీఓ కాలం నుంచి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టారు. గతేడాది ఆయన మరణానంతరం స్టార్ హెల్త్‌తో సహా ఆయనకు సంబంధించిన అన్ని షేర్లు రేఖకు బదిలీ అయ్యాయి.

స్టార్ హెల్త్ షేరు ధర సోమవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఇన్‌ట్రా డే గరిష్ట స్థాయి రూ.556.95ను తాకింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన నాలుగు గంటల్లోనే ఇన్‌ట్రాడేలో ఒక్కో ఈక్విటీ షేర్ రూ.47.90 పెరిగింది. స్టార్ హెల్త్ షేర్ ధర పెరగడంతో రేఖా ఝున్‌ఝున్‌వాలా దాదాపు రూ. 482 కోట్లు ఆర్జించారు.

బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన తర్వాత రాకేష్ జున్‌జున్‌వాలా రెండింటిలోనూ 10,07,53,935 స్టార్ హెల్త్ షేర్‌లను కలిగి ఉండేవారు. ఇది కంపెనీ మొత్తం చెల్లింపు మూలధనంలో 17.50 శాతం. ఆ షేర్లన్నీ ఇప్పుడు రేఖా ఝున్‌జున్‌వాలా సొంతమయ్యాయి. ఒక్కో షేరుకు రూ.47.90 పెరగడం ద్వారా ఆమె రూ.482 కోట్ల భారీ మొత్తం ఆర్జించిన్లయింది. టాటా కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఆమె ఇటీవల రెండు వారాల్లోనే రూ.1000 కోట్లు సంపాదించారు. రేఖా ఝున్‌జున్‌వాలా నికర ఆస్తి విలువ రూ. 47,650 కోట్లుగా అంచనా.

(ఇదీ చదవండి: తెలిసిన జాక్‌మా జాడ! ఎక్కడ ఉన్నాడంటే..)

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి