Breaking News

పండుగ సీజన్‌: ఎంతమంది వెహికల్స్ కొన్నారో తెలుసా?

Published on Sun, 11/17/2024 - 18:22

భారతదేశంలో మొత్తం పండుగ సీజన్‌లో 42 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, త్రీ వీలర్స్ అన్నీ ఉన్నాయి. 2023 ఇదే పండుగ సీజన్‌లో అమ్ముడైన మొత్తం వాహనాలు 38.37 లక్షల యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్‌లో వాహన విక్రయాలు పెరిగినట్లు తెలుస్తోంది.

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) 2024 పండుగ సీజన్‌లో 45 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడవుతాయని అంచనా వేసింది. అయితే ఊహించిన అమ్మకాలు జరగలేదు, కానీ 2023 కంటే 2024లో సేల్స్ ఉత్తమంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది.

2023లో ద్విచక్ర వాహనాల సేల్స్ 29.10 లక్షల యూనిట్లు కాగా.. 2024లో 33.11 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే ఈ ఏడాది అమ్మకాలు 13.8 శాతం వృద్ధి చెందాయి. త్రీ వీలర్స్ సెల్స్ 2023లో 1.50 లక్షల యూనిట్లు.. 2024లో 6.8 శాతం పెరిగి 1.60 లక్షల యూనిట్లకు చేరింది.

ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..

కమర్షియల్ వాహన విక్రయాలు 2023లో 1.27 లక్షల యూనిట్లు.. కాగా 2024లో 1.29 లక్షల యూనిట్లు. ఈ విభాగంలో అమ్మకాలు 1 శాతం పెరిగింది. ప్యాసింజర్ వాహన సేల్స్ 2023లో 5.63 లక్షల యూనిట్లు, 2024లో 6.03 లక్షల యూనిట్లు. ఇలా మొత్తం మీద 2024లో మొత్తం వాహనాల సేల్స్ 42 లక్షల యూనిట్లను అధిగమించింది.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)