Breaking News

లగ్జరీ పెరిగింది.. కొత్త ఫారిన్‌ బ్రాండ్స్‌ వచ్చేస్తున్నాయి..

Published on Thu, 02/06/2025 - 08:29

విదేశీ బ్రాండ్లను భారత రిటైల్‌ మార్కెట్‌ ఊరిస్తోంది. 2024లో దాదాపు 27 కొత్త విదేశీ రిటైల్‌ బ్రాండ్స్‌ దేశీయ విపణిలోకి ఎంట్రీ ఇచ్చాయి. విలాసవంత వస్తువుల కోసం పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో తమ ఉనికిని చాటుకోవడానికి ఇవి భారత్‌లో రంగ ప్రవేశం చేస్తున్నాయని రియల్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ తెలిపింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే భారత్‌లో అడుగుపెట్టిన బ్రాండ్ల సంఖ్య 2024లో రెట్టింపు అయిందని వెల్లడించింది.

పట్టణీకరణ, ఖర్చు చేయదగ్గ ఆదాయం పెరగడం, షాపింగ్‌ ప్రాధాన్యతల్లో మార్పు లగ్జరీ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచుతోందని వివరించింది. భారత్‌ను ప్రపంచవ్యాప్తంగా చురుకైన రిటైల్‌ మార్కెట్‌లలో ఒకటిగా మార్చిందని తెలిపింది. 2023లో 14 బ్రాండ్స్‌ ఇక్కడి మార్కెట్లో ప్రవేశించాయి. నాలుగేళ్లలో 60 విదేశీ బ్రాండ్స్‌ భారత్‌కు వచ్చాయి.  

దృష్టిని ఆకర్షించింది.. 
2024లో దేశీయ రిటైల్‌ రంగంలో బ్యూటీ, సౌందర్య సాధనాలు, ఆరోగ్య సంరక్షణ; పాదరక్షలు, బ్యాగ్స్, యాక్సెసరీస్‌; ఫ్యాషన్, దుస్తుల విభాగాలు టాప్‌–3లో నిలిచాయి. ‘భారత రిటైల్‌ రంగం అంతర్జాతీయ కంపెనీల దృష్టిని ఆకర్షించింది. నాలుగేళ్లుగా ఇక్కడి విపణిలో ఉనికిని నెలకొల్పడానికి ప్రయత్నాలను క్రమంగా పెంచాయి.

గత సంవత్సరం ప్రవేశించిన కంపెనీల్లో 56 శాతం యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా ప్రాంతానికి చెందినవి. ఫ్రెంచ్, ఇటాలియన్‌ సంస్థలు సైతం వీటిలో ఉన్నాయి. గత ఏడాది దేశంలో ఈ బ్రాండ్స్‌ సుమారు 1,90,000 చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నాయి. ఇందులో సగం వాటా ఫ్యాషన్, అపారెల్‌ బ్రాండ్స్‌ కైవసం చేసుకున్నాయి’ అని జేఎల్‌ఎల్‌ ప్రతినిధి రాహుల్‌ అరోరా తెలిపారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)