Breaking News

రూ.46.89 లక్షల స్కోడా కారు లాంచ్: పూర్తి వివరాలు

Published on Thu, 04/17/2025 - 15:22

2024లో ప్రపంచ మార్కెట్లో అడుగుపెట్టిన అయిన రెండవ తరం స్కోడా కొడియాక్ ఎట్టకేలకు భారతదేశంలో లాంచ్ అయింది. ఇది లౌరిన్ & క్లెమెంట్ (L&K), స్పోర్ట్‌లైన్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 46.89 లక్షలు, రూ. 48.69 లక్షలు (ఎక్స్ షోరూమ్).

2025 స్కోడా కొడియాక్ కారు దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ కారు ముందు భాగంలో సిగ్నేచర్ బటర్‌ఫ్లై గ్రిల్‌ ఉంటుంది.  స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ అలాగే ఉంది. కొత్త ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లాంప్ సిగ్నేచర్‌లను పొందుతాయి. బంపర్ రెండు అంచులలో ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్‌ను పొందుతుంది. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో సీ షేప్ టెయిల్ లాంప్ వంటివన్నీ ఇక్కడ కనిపిస్తాయి. కొత్త కొడియాక్ దాని మునుపటి మోడల్ కంటే కొంత పెద్దదిగా ఉంటుంది.

కొడియాక్ లోపలి భాగంలో 13 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, టూ స్పోక్ స్టీరింగ్ వీల్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 13 స్పీకర్ కాంటన్ సౌండ్ సిస్టమ్, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

ఇదీ చదవండి: భారత్‌లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!

ఇంజిన్ విషయానికి వస్తే.. 2025 కొడియాక్ కారులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 204 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. రెండు వేరియంట్లు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతాయి. మైలేజ్ 14.86 కిమీ/లీ వరకు ఉంటుందని స్కోడా వెల్లడించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)