Breaking News

ఒక్క చూపుకే ఫిదా చేస్తున్న కొత్త బీఎండబ్ల్యూ కారు: రేటెంతో తెలుసా?

Published on Thu, 11/21/2024 - 19:00

ఈ ఏడాది జూన్‌లో 'ఎం5' (M5) కారును గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన తరువాత బీఎండబ్ల్యూ ఎట్టకేలకు భారతీయ విఫణిలో లాంఛ్ చేసింది. బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన ఎం5 ధర రూ.1.99 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్, వీ8 పవర్‌ట్రెయిన్‌ రెండూ ఉపయోగిస్తుంది. కాబట్టి పర్ఫామెన్స్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుంది.

బీఎండబ్ల్యూ ఎం5 భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ (సీబీయూ) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది. ఈ కారణంగానే దీని ధర కొంత అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఈ కారులోని 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ 577 Bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 194 Bhp, 280 Nm టార్క్ అదనంగా ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ పొందుతుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 350 కిమీ (ఎం డ్రైవర్ ప్యాకేజీతో).

బీఎండబ్ల్యూ ఎం5 కారులోని 22.1 కిలోవాట్ బ్యాటరీ 70 కిమీ రేంజ్ అందిస్తుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి 7.4 కేడబ్ల్యు ఏసీ ఛార్జర్ ఉపయోగించాలి. బ్యాటరీ 3:15 గంటలలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. కాబట్టి బ్యాటరీ కూడా మంచి రేంజ్ అందిస్తుందని స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: సేఫ్టీలో జీరో రేటింగ్: భద్రతలో ఫ్రెంచ్ బ్రాండ్ ఇలా..

2025 ఎం5 బోల్డ్ డిజైన్‌ కలిగి సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ పొందుతుంది. ఫ్రంట్ బంపర్ ఎయిర్ వెంట్స్ కలిగి ఉండటం చూడవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ డిఫ్యూజర్‌తో రీస్టైల్ బంపర్, క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్‌ వంటివి కూడా పొందుతుంది. ఈ కారులో త్రీ-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌ ఉంటుంది. కర్వ్డ్ ట్విన్ స్క్రీన్‌లు, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ హీటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ టెయిల్‌గేట్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉంటాయి.

బీఎండబ్ల్యూ ఎం5 నాన్ మెటాలిక్ ఆల్పైన్ వైట్, బ్లాక్ సఫైర్, సోఫిస్టో గ్రే, బ్రూక్లిన్ గ్రే, ఫైర్ రెడ్, కార్బన్ బ్లాక్, ఐల్ ఆఫ్ మ్యాన్ గ్రీన్, స్టార్మ్ బే, మెరీనా బే బ్లూ వంటి మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంటీరియర్ రెడ్/బ్లాక్, కైలామి ఆరెంజ్, సిల్వర్‌స్టోన్/బ్లాక్ & ఆల్-బ్లాక్ వంటి కాంబినేషన్‌లను పొందుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)