Breaking News

బజాజ్‌ చేతక్‌ ప్రీమియం బైక్‌ వచ్చేస్తోంది.. ఎలా ఉందో చూశారా?

Published on Fri, 01/05/2024 - 10:59

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ బజాజ్‌ శుక్రవారం చేతక్‌ అర్బేన్‌, ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లను లాంచ్‌ చేయనుంది. అయితే ఈ బైక్‌ ధరలు ప్రస్తుతం ఈవీ మార్కెట్‌లో లీడింగ్‌లో ఉన్న ఓలా, ఎథేర్‌ ఈవీ స్కూటర్‌ల కంటే తక్కువేనని తెలుస్తోంది. 

ఓలా ఎస్‌1 ప్రో (రూ1,47,499), ఎథేర్‌ 450 ఎక్స్‌ (రూ.1,37,999) ధరలు ఇలా ఉండగా చేతక్‌ అర్బేన్‌ ధర రూ.1.15లక్షలు, చేతక్‌ ప్రీమియం ఎక్స్‌ షోరూం ధర రూ.1.35లక్షలుగా ఉంది.   

బజాజ్‌ సంస్థ 2019లో తొలిసారి చేతక్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌లను మార్కెట్‌కు పరిచయం చేసింది. నాటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 140 నగరాల్లో లక్షకు పైగా వెహికల్స్‌ను అమ్మింది. 

ఇక తాజాగా విడుదల చేయనున్న రెండు వేరియంట్‌లలో 3.2 కేడబ్ల్యూ బ్యాటరీతో రానుంది. 127 కిలోమీటర్ల రేంజ్‌ వరకు ప్రయాణించచ్చు. అదనంగా చేతక్‌ ప్రీమియంలో 800 డబ్ల్యూ ఛార్జర్‌తో రానుంది. ఈ సదుపాయంతో చేతక్‌ ను 30 నిమిషాల్లో 15.6 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించవచ్చు. టాప్‌ స్పీడ్‌ గంటకు 73 కిలోమీటర్లు వరకు ప్రయాణించ్చు. ఇక ఈ బైక్‌లో బ్లూటూత్‌, యాప్‌ కనెక్టివిటీ, నోటిఫికేషన్‌ అలెర్ట్‌ల కోసం కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.  

కొత్త టీఎఫ్‌టీ స్క్రీన్ బ్లూటూత్ కనెక్టివిటీ, యాప్ ఆధారిత టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/ఎస్‌ఎంఎస్‌/మ్యూజిక్ అలర్ట్‌లు, రిమోట్ ఇమ్మొబిలైజేషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్‌)ని అనుసంధానం చేస్తుందని భావిస్తున్నారు. కాగా ఈవీ మార్కెట్‌లో ఓలా ఎస్‌1 ప్రో, ఎథేర్‌ 450 ఎక్స్‌, సింపుల్‌ వన్‌లు.. బజాజ్‌ చేతక్‌తో  పోటీ పడనున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)